AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!

పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని ఇక శాశ్వతంగా రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో.. ఇకపై పునరుద్ధరించకుండా శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన నీటి హెచ్చరికలపై స్పందించిన ఒమర్.. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!
Jammu Kashmir Cm Omar Abdullah
Balaraju Goud
|

Updated on: Aug 14, 2026 | 4:49 PM

Share

పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని ఇక శాశ్వతంగా రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో.. ఇకపై పునరుద్ధరించకుండా శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన నీటి హెచ్చరికలపై స్పందించిన ఒమర్.. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

పాకిస్థాన్‌కు నీటి సరఫరా నిలిపివేస్తే రక్తం పారుతుందంటూ షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై ఒమర్ ఘాటుగా స్పందించారు. “పీల్చింది మా రక్తమే.. ఈ నదులపై మొదటి హక్కు మాకే ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ఒకవైపు పాకిస్థాన్ కాశ్మీరీల శ్రేయోభిలాషిగా నటిస్తూ, మరోవైపు సింధు జలాల ద్వారా మా రక్తాన్ని పీలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. నదులపై అసలైన హక్కు జమ్మూ కాశ్మీర్ ప్రజలకే ఉందని, అందువల్ల ఒప్పందం రద్దు శాశ్వతంగా రద్దు చేయాలన్నారు. 2025లో పహల్గామ్ దాడి తర్వాత ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ఆయన సమర్థించారు.

సింధు జలాల ఒప్పందం ఏంటి?

1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాలకు కేటాయించారు. తూర్పు నదులైన రావి, బియాస్‌, సట్లెజ్‌లపై భారత్‌కు ప్రధాన వినియోగ హక్కులు ఉండగా.. పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్‌లపై పాకిస్థాన్‌కు ప్రధాన హక్కులు కల్పించారు. మొత్తంగా నదీ జలాల్లో అధిక భాగం పాకిస్థాన్‌ వినియోగానికి కేటాయించబడింది.

2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఇరు దేశాల మధ్య నీటి అంశం మరింత సున్నితమైన రాజకీయ, దౌత్య అంశంగా మారింది.

పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు ఒమర్ డిమాండ్

జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని కూడా ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. అది గొప్ప హామీ అని పేర్కొంటూ.. ఇంకా ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాశ్మీరీ పండిట్లకు బెదిరింపులపై ఆందోళన

కాశ్మీరీ పండిట్ ఉద్యోగులకు వస్తున్న ఉగ్రవాద బెదిరింపులపై కూడా ఒమర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి హెచ్చరికలను భద్రతా సంస్థలు తేలికగా తీసుకోకూడదని, గతంలో జరిగిన లక్షిత హత్యల నేపథ్యంలో ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. ఉగ్రవాదం తగ్గిందని చెబుతున్న సమయంలో ఇలాంటి బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై జరిగిన దాడిని కూడా ఒమర్ ఖండించారు. జెడ్‌ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిపై దాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని, విభేదాలను ఎన్నికలు, ఓట్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

మొత్తంగా సింధు జలాల ఒప్పందం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా, కాశ్మీరీ పండిట్ల భద్రత వంటి కీలక అంశాలపై ఒమర్ అబ్దుల్లా చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేయాలన్నది ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా చేసిన డిమాండ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us