AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఇది అసలు ఊహించలేదుగా

శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'ది ప్యారడైజ్' సినిమాలో జడల్ అనే పాత్రలో హీరో నాని ఒదిగిపోయాడు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ది ప్యారడైజ్ సినిమాకు నాని ఫస్ట్ ఛాయిస్ కాదట.

The Paradise: నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఇది అసలు ఊహించలేదుగా
The Paradise Movie
Basha Shek
|

Updated on: Sep 27, 2026 | 2:43 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది చాలా కామన్. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి హిట్ కావొచ్చు మరోసారి ఫ్లాప్ కావొచ్చు. నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ది ప్యారడైజ్’ లోనూ ఇలాగే జరిగిందని తెలుస్తోంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు. జడల్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే సుబ్బు అనే పాత్రలో హీరోయిన కయాదు లోహర్ కూడా ఎంతో అందంగా కనిపించింది. ఇక శికంజా మాలిక్ అనే కరుడు గట్టిన విలన్ పాత్రలో మోహన్ బాబు నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుతం ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ కలెక్షన్లలో మాత్రం అదరగొడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు దాటిన ఈ సినిమా మూడు రోజుల్లో మొత్తం రూ. 136 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు హీరోగా నాని ఫస్ట్ ఛాయిస్ కాదట. దసరా తర్వాత ది ప్యారడైజ్ కథతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంప్రదించారట. అయితే అప్పటికే బన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారట. దీంతో ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఈ కారణంగా డైరెక్టర్ శ్రీకాంత్ మరోసారి నాని దగ్గరకే వెళ్లారట. అప్పటికే వీరి కాంబినేషన్ లో దసరా వంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ది ప్యారడైజ్ స్టోరీ కూడా నచ్చడంతో నాని కూడా వెంటనే ఒకే చెప్పాడు. అలా మొత్తానికి ది ప్యారడైజ్ సినిమా పట్టాలెక్కిందట. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇప్పుడీ విషయం నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మూడు రోజుల్లో 136 కోట్లు..

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ది ప్యారడైజ్ సినిమాలో రాఘవ్ జుయేల్, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ మూవీకి స్వరాలు అందించారు.

బుక్ మై షోలోనూ ది ప్యారడైజ్ సినిమా హవా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us