Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..

దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.. చలికాలంలో గుండెపోటు ముప్పు 30 శాతం పెరుగుతుందని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఈ సీజన్‌లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..
Heart Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 10, 2024 | 5:01 PM

ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వేసవితో పోలిస్తే శీతాకాలంలో గుండెపోటు ముప్పు 25 శాతం పెరుగుతుందని AIIMS పరిశోధనలో తేలింది. చల్లని సీజన్లో, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గుండె సిరల్లో సంకోచం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది.. ఫలితంగా ఇది గుండెపోటుకు కారణమవుతుంది. ఎండాకాలంతో పోలిస్తే శీతాకాలంలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 30 శాతం పెరుగుతుందని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పరిశోధనలో తేలింది. అటువంటి పరిస్థితిలో, ఈ సీజన్‌లో హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో గుండె జబ్బులను ఎలా నివారించవచ్చు..? గుండె పోటు ప్రమాదం నుంచి బయటపడేందుకు నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ విషయాలను తెలుసుకోండి..

చలికాలంలో చల్లటి గాలి పీల్చడం వల్ల కూడా గుండె సిరల్లో స్పాసమ్ (బిగుసుకుపోవడం లేదా సంకోచించుకుపోవడం) ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది హృదయనాళ వ్యవస్థపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. చలి వాతావరణం వల్ల రక్తపోటు పెరుగుతుందని గురుగ్రామ్‌లోని పరాస్ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్, యూనిట్ హెడ్ డాక్టర్ అమిత్ భూషణ్ శర్మ చెప్పారు. ఈ సీజన్‌లో దీర్ఘకాలిక గుండె సమస్యలు కూడా పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

శీతాకాలంలో గుండెపోటును ఎలా నివారించాలి

చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వెచ్చని బట్టలు ధరించండి..

అకస్మాత్తుగా భారీ వ్యాయామాలు చేయవద్దు. బయట వ్యాయామం చేసే బదులు ఇంట్లోనే తేలికపాటి ఇండోర్ వ్యాయామాలు చేయండి.

ఈ సీజన్‌లో మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

ఆహారంలో సీజన్ ప్రకారం పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి.

చాలా తీపి, ఫాస్ట్ ఫుడ్, ఫ్రై ఫుడ్ తినడం మానుకోండి.

రక్తపోటు తనిఖీ..

శీతాకాలంలో రక్తపోటును తనిఖీ చేయడం చాలా ముఖ్యం. బీపీ పెరిగితే వైద్యులను సంప్రదించాలి. మీకు ఇప్పటికే ఏదైనా గుండె జబ్బు ఉంటే, మీ మందులను సకాలంలో తీసుకోండి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..

తరచుగా ఛాతీ నొప్పి, భయము లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండెపోటు లక్షణాలు ఏవైనా ఉంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లండి. పరీక్షలు చేయించుకోండి.. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. సకాలంలో గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా వ్యాధిని సులభంగా నివారించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి