AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swachh Bharat: దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్.. షాక్‌కు గురిచేస్తున్న గణాంకాలు!

ప్రస్తుతం భారతదేశవ్యాప్తంగా 128 మిలియన్లకు పైగా కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను కొనుగోలు చేస్తున్నాయి. 52 మిలియన్ కుటుంబాలు ఫ్లోర్ క్లీనర్ వాడుతున్నాయి.

Swachh Bharat: దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్.. షాక్‌కు గురిచేస్తున్న గణాంకాలు!
Household Toilet Cleaners
Balaraju Goud
|

Updated on: Dec 16, 2024 | 4:23 PM

Share

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌ మిషన్ పదేళ్లుగా కొనసాగుతోంది. స్వచ్చభారత్‌ కార్యక్రమం దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. స్వచ్చతతో పాటు ఆరోగ్యానికి వ్యాయామం లాంటిది అంటుంటారు ప్రధాని మోదీ.

ఒక దశాబ్దం క్రితం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించినప్పుడు కేవలం ఐదుగురిలో ఒక్కరు మాత్రమే ఇప్పుడు సగానికి పైగా భారతీయ గృహాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నారు. ఇతర లక్ష్యాలతో పాటు, మరిన్ని మరుగుదొడ్లను నిర్మించడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా బహిరంగ మలవిసర్జన సమస్యను తొలగించడం మిషన్ లక్ష్యం.

2014లో టాయిలెట్ క్లీనర్లు వినియోగం 19% శాతం, , ఫ్లోర్ క్లీనర్ల వాడకం 8% మాత్రమే. ఒక నివేదిక ప్రకారం, ఇది రెండింతలు పెరిగింది. 2024లో 53% కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను ఉపయోగిస్తున్నాయి. 22% ఫ్లోర్ క్లీనర్‌లను కొనుగోలు చేస్తున్నాయి. అంటే 128 మిలియన్లకు పైగా కొత్త కుటుంబాలు టాయిలెట్ క్లీనర్‌లను కొనుగోలు చేస్తున్నాయి. 52 మిలియన్ కుటుంబాలు ఫ్లోర్ క్లీనర్లను వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దాగి ఉన్న ప్రమాదాల గురించి వినియోగదారులను అప్రమత్తం చేయడం నుండి మెరుగైన పరిశుభ్రత పద్ధతుల గురించి అవగాహన కల్పించడం వరకు, Reckitt Benckiser, Hindustan Unilever, Dabur వంటి బాత్రూమ్ పరిశుభ్రత ఉత్పత్తుల విక్రయదారులు కూడా సహకరిస్తున్నారు. “స్వచ్ఛ్ భారత్ అభియాన్ కింద గ్రామీణ గృహాల టాయిలెట్ల నిర్మాణం పరిశుభ్రత గురించి అవగాహన పెంచడంలో సహాయపడింది, తద్వారా శుభ్రపరిచే ఉత్పత్తుల అవసరం. దేశంలో పట్టణ ప్రాంతాల్లో హౌసింగ్ సెగ్మెంట్ వృద్ధి, అవగాహన ఉన్న కొనుగోలుదారుల సంఖ్య పెరుగుదల కారణమని డాబర్ మార్కెటింగ్ హెడ్ (హోమ్ కేర్) వైభవ్ రాఠి అభిప్రాయపడ్డారు.

భారతదేశం ఉపరితల క్లీనర్ మార్కెట్ విలువ సుమారు రూ.4,200 కోట్లు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో టాయిలెట్ క్లీనర్ల వాటా రూ.2,000 కోట్లు. దశాబ్దం క్రితం ఈ వర్గం ఎక్కువగా నగర కేంద్రంగా ఉండేదని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడు అందులో చాలా మార్పు వచ్చింది. ఒక దశాబ్దం క్రితం, టాయిలెట్ క్లీనర్‌లను కొనుగోలు చేసే గృహాలలో 82% పట్టణ ప్రాంతాల్లో ఉండేవి. ఫ్లోర్ క్లీనర్ల కోసం 90% మంది ఉన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 52% వినియోగదారులు పెరిగినట్లు వరల్డ్‌ప్యానెల్ విభాగం దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ కె రామకృష్ణన్ అన్నారు. “స్పష్టంగా, స్వచ్ఛ భారత్ అభియాన్ భారతీయ ఇళ్లలో పరిశుభ్రత ప్రాముఖ్యతను పెంచింది. తయారీదారులు గృహ పరిశుభ్రత వర్గాల్లోకి రాణించడానికి దోహదపడింది.

2014లో ప్రారంభించినప్పటి నుండి, స్వచ్ఛ భారత్ అభియాన్ 5,00,000 గ్రామాలకు బహిరంగ మలవిసర్జన రహిత ప్లస్ హోదాను సాధించింది. గ్రామీణ పారిశుధ్యం 39% నుండి 100%కి పెరిగింది. ఇది కాకుండా, అక్షయ్ కుమార్ నటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ (2017) కూడా గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ల ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. పరిశుభ్రత ఉత్పత్తులను విక్రయించే కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతను పెంపొందించుకున్నాయి. ఉదాహరణకు, హిందుస్థాన్ యూనిలీవర్ 2016లో సువిధ కేంద్రాలుగా పిలవబడే కమ్యూనిటీ టాయిలెట్ బ్లాక్‌లను ప్రారంభించింది. ఇప్పుడు వాటి సంఖ్య 16కి కుదించుకుపోయింది. అంటే దీన్ని బట్టి పరిశుభ్రత పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన పెరుగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..