Liquor Stores: మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు.

Liquor Stores: మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు.

Anil kumar poka

|

Updated on: Dec 16, 2024 | 9:42 AM

ఆంధ్రప్రదేశ్‌లో మద్యానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి టెండర్లకు సిద్ధమైంది. రాష్ట్రంలో 12 మద్యం ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో మందుబాబుల కోసం తీసుకొచ్చిన మరో ప్రాజెక్టు ఇది. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగడమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకుంది. లైసెన్సులు ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయబడతాయి.. ఈ స్టోర్ల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు రుసుము 15 లక్షల రూపాయిల కాగా.. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయిలుగా నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్సు రుసుము 10శాతం చొప్పున పెరుగుతుంది. ప్రీమియం షాపుల లైసెన్సుదారులకు ఇష్యూ ప్రైస్‌పై 20 శాతం మార్జిన్‌ చెల్లిస్తారు. ఈ ప్రీమియం స్టోర్లు కనీసం 4వేల చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా కలిగిన భవనంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం వంటి మున్సిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల ఎక్సైజ్‌ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. దరఖాస్తులపై ఆ నోటిఫికేషన్‌లో పూర్తిగా క్లారిటీ ఇస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.