Orange: శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?

Orange: శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?

Anil kumar poka

|

Updated on: Dec 16, 2024 | 9:29 AM

చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా చాలా మంది ఈ సీజన్‌లో సీజనల్ ఫ్రూట్స్ అయిన నారింజలను తినడానికి వెనుకాడతారు. నారింజ పండ్లను తింటే జలుబు, ఫ్లూ వస్తాయని భయపడుతుంటారు. నిజానికి, ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నారింజ పండును తప్పనిసరిగా ఈ కాలంలో తినాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

చలికాలంలో చలిగాలుల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. సీజనల్‌ వ్యాధులతో పోరాడటానికి బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అవసరం. ఆరెంజ్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నారింజ పేగులను బాగా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరెంజ్‌లో విటమిన్ సి, ఇ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మం శుభ్రపడుతుంది. ముఖంపై ముడతలు తగ్గుతాయి. అంతేకాకుండా ఇది చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. బ్లాక్ హెడ్స్, ముఖంపై ఏర్పడే ఇతర మచ్చలను సైతం తొలగిస్తుంది. ఆరంజ్‌ పండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ తీసుకుంటే హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. నారింజలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది మూత్రంలో సిట్రేట్ స్థాయిని పెంచుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కనుక శీతాకాలంలో విరివిగా లభించే ఈ పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.