AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel Affordable Recharge: ఎయిర్‌టెల్ యూజర్లకు ఎగిరి గంతేసే వార్త.. కొత్త సంవత్సరం ముందు చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ..!

కొత్త సంవత్సరం ముంతు ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. .398 లకే హై స్పీడ్ ఇంటర్నెట్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొచ్చింది. ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Airtel Affordable Recharge: ఎయిర్‌టెల్ యూజర్లకు ఎగిరి గంతేసే వార్త.. కొత్త సంవత్సరం ముందు చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ..!
New Airtel Affordable Plans
Velpula Bharath Rao
|

Updated on: Dec 16, 2024 | 11:56 AM

Share

టెలికాం రంగంలో పోటీ పెరుగుతోంది. కంపెనీలు రెగ్యులర్ వ్యవధిలో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా అలాంటి ప్లాన్‌నే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్  సరికొత్త ప్లాన్‌తో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.398 లకే హై స్పీడ్ ఇంటర్నెట్‌తో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది.

రూ. 398 రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులు 28 రోజుల హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఒక డివైస్‌లో మాత్రమే హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. వినియోగదారులు లైన్ క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు చూడవచ్చు. రోజుకు 2GB 5G డేటాతో పాటు అపరిమిత లోకల్, STD రోమింగ్ కాల్స్, 100 రోజువారీ SMSలను కూడా అందిస్తుంది.

Airtel రూ.409 ప్రీపెయిడ్ ప్లాన్‌ కూడా ఉంది.  రూ. 409కి 22 OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లు, రోజుకు 2.5GB డేటా, Airtel Xstream Play Premiumకి కాంప్లిమెంటరీ యాక్సెస్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ వినియోగదారులు 28 రోజుల చెల్లుబాటుతో అపరిమిత 5G ఇంటర్నెట్, టాక్ టైమ్ పొందుతారు.

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం తన నూతన సంవత్సర ప్లాన్‌ను ఇటీవలే తీసుకొచ్చిన సంగతి తెలిసింది. రూ.2025 ధరతో రోజువారీ డేటా పరిమితి 2.5 GB, అపరిమిత కాలింగ్, SMS, JioTV, JioCinema Jio యాప్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ని డిసెంబర్ 11 నుండి జనవరి 11, 2025 వరకు MyJio యాప్ లేదా Jio వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. జియో న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్ ఎక్కువ కాలం చెల్లుబాటు అవ్వడమే కాకుండా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి