వాముతో కలిగే లాభాలు తెలిస్తే వామ్మో అనాల్సిందే!

Jyothi Gadda

16 December 2024

TV9 Telugu

వాములో నియాసిన్, థియామిన్, కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ విటమిన్లు ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

TV9 Telugu

వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్‌ ఇట్టే కరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులను దూరం చేస్తుంది. 

TV9 Telugu

రక్తపోటును తగ్గించడంలో కూడా వాము కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడకుండా చేస్తుంది. 

TV9 Telugu

జలుబు, దగ్గు వంటి సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేయడంలో కూడా వాము పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో వాము వేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

TV9 Telugu

వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రో బయల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

TV9 Telugu

పీరియడ్స్ సమయంలో మహిళలకు తిమ్మిర్లు, కడుపునొప్పి వంటివి కలుగుతాయి. అలాంటి సమయంలో వాము నీళ్లు తీసుకోవడం మంచిది. ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది.

TV9 Telugu

పంటి సమస్యలను తగ్గించడానికి వాము సహాయపడుతుంది. వాముని పొడి చేసుకుని తినడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దుర్వాసన సమస్య రాదు.

TV9 Telugu

అందాన్ని కాపాడడంలో కూడా వాము ఉపయోపడుతుంది. వాము పొడిలో కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి అప్లై చేసుకుంటే మొటిమలు, మచ్చలు దూరమవుతాయి.