AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda EV Scooters: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. మరో 15 రోజుల్లో హోండా ఈవీ స్కూటర్ల బుకింగ్స్ షురూ

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్‌ ధరల నుంచి రక్షణకు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు ఈవీలను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హోండా ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోండా ఈవీ స్కూటర్ల బుకింగ్స్‌ గురించి క్రేజీ అప్‌డేట్స్‌ను తెలుసుకుందాం.

Honda EV Scooters: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. మరో 15 రోజుల్లో హోండా ఈవీ స్కూటర్ల బుకింగ్స్ షురూ
Honda Ev Scooter
Nikhil
|

Updated on: Dec 16, 2024 | 8:30 AM

Share

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఇటీవల హోండా యాక్టివా-ఈ, క్యూసీ-1 అనే రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను రిలీజ్‌ చేసిన విషయంలో తెలిసిందే. ఈ రెండు స్కూటర్లను నవంబర్ 27, 2024న బెంగళూరులో ప్రకటించారు. అయితే తాజాగా ఈ స్కూటర్ల బుకింగ్స్‌ గురించి హోండా ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు స్కూటర్ల బుకింగ్‌లు జనవరి 1, 2025న ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అలాగే ఈ స్కూటర్ల డెలివరీలు మాత్రం ఫిబ్రవరి 2025లో ప్రారంభం కానున్నాయని వివరించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే యాక్టివా-ఈ స్కూటర్‌ రిమూవబుల్‌ బ్యాటరీ మేకానిజంతో వస్తుంది. యాక్టివా -ఈ స్కూటర్ రెండు 1.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీలతో వస్తుంది. ఒక్కో ఛార్జ్‌కు 102 కిలోమీటర్ల పరీక్ష పరిధిని అందిస్తుంది. 

ఈ బ్యాటరీలను ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలో అందుబాటులో ఉన్న హోండా పవర్ ప్యాక్ ఎక్స్ఛేంజర్ స్టేషన్లలో మార్చుకోవచ్చు. యాక్టివా-ఈ స్కూటర్‌ 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని, 22 ఎన్‌ఎం టార్క్‌ను అందించే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్‌ 7.3 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని హోండా ప్రతినిధులు చెబుతున్నారు. గంటకు 80 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు. ఈ స్కూటర్ హోండాకు సంబంధించిన రోడ్‌ సింక్‌ డుయో అప్లికేషన్ ద్వారా నావిగేషన్, అప్‌డేట్‌ల కోసం కనెక్టివిటీ ఫీచర్‌లతో కూడిన 7 అంగుళాల డిజిటల్‌ స్క్రీన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. 

హోండా క్యూసీ-1 స్కూటర్‌ ఫిక్స్‌డ్‌ 1.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్‌ చేస్తే 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. స్కూటర్‌ను ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌ని ఉపయోగించి ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్‌ 80 శాతం ఛార్జ్‌ని చేరుకోవడానికి సుమారు 4.5 గంటలు, పూర్తి ఛార్జ్‌కి 6.5 గంటలు పడుతుంది. క్యూసీ-1 స్కూటర్‌ గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ రెండు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇది అవసరమైన సమాచారం కోసం చిన్న 5 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రెండు స్కూటర్లు మొదట్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబైతో సహా ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంటాయి. బెంగుళూరు సమీపంలోని హెచ్‌ఎంఎస్‌ఐ నర్సాపూర్‌లో ఈ స్కూటర్ల తయారు చేస్తున్నారు. హోండా ఈ రెండు మోడళ్లకు మూడు సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. వీటితో పాటు మొదటి సంవత్సరం ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు ఫ్రీ సర్వీసులను అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి