EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. విత్ డ్రా కోసం ఏటీఎమ్ కార్డు.. పూర్తి వివరాలు ఇవే..
మార్చి 2026 నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును తక్షణమే విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త పద్ధతితో క్లెయిమ్ ప్రాసెస్ వేగవంతమై, డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అవసరాలకు పీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందండి. మనీ ఎలా విత్ డ్రా చేసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

పీఎఫ్ అనేది ఉద్యోగులకు ఒక వరంలాంటిది. అత్యవసర సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా తన సేవలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరింత వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 2026 నాటికి పీఎఫ్ సభ్యులు ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్‌డ్రా ఎలా?
కొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్యాంక్ కార్డుల మాదిరిగానే EPFO సభ్యులకు పీఎఫ్ విత్‌డ్రా కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డు సభ్యుడి యూఏఎన్, పీఎఫ్ ఖాతాకు కనెక్ట్ అయి ఉంటుంది. నిర్దేశించిన ఏటీఎంలకు వెళ్లి కార్డును స్వైప్ చేసి పిన్ లేదా ఓటీపీ ద్వారా నగదు తీసుకోవచ్చు. విత్‌డ్రా చేసిన నగదు నేరుగా మీ లింక్డ్ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది.
యూపీఐ ద్వారా తక్షణమే పీఎఫ్ మనీ
ప్రస్తుతం పీఎఫ్ క్లెయిమ్ చేస్తే సెటిల్ కావడానికి చాలా రోజులు పడుతోంది. కానీ యూపీఐ విధానం ద్వారా ఇది క్షణాల్లో పూర్తవుతుంది. EPFO పోర్టల్ లేదా అనుమతించిన యూపీఐ యాప్‌లోకి లాగిన్ అయ్యి PF Withdrawal ఎంపికను ఎంచుకోవాలి. ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఆథెంటికేషన్ పూర్తయిన వెంటనే నగదు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వస్తుంది.
ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు?
పదవీ విరమణ పొదుపును రక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75శాతం వరకు మాత్రమే తక్షణ ఉపసంహరణలకు అనుమతించే అవకాశం ఉంది. మిగిలిన మొత్తం వడ్డీని సంపాదిస్తూ భవిష్యత్తు అవసరాల కోసం అలాగే ఉంటుంది. అలాగే 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు ఇల్లు కొనుగోలు కోసం 90శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు – అర్హతలు
ఈ సౌకర్యాన్ని పొందాలంటే ఉద్యోగులు ఇవి తప్పనిసరిగా పూర్తి చేయాలి..
UAN యాక్టివేషన్: మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివ్‌గా ఉండాలి.
KYC పూర్తి: ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు పీఎఫ్ ఖాతాకు లింక్ అయ్యి ఉండాలి.
బ్యాంక్ ఒప్పందాలు: ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి EPFO ఇప్పటికే 32 ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




