AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా.. లాస్ట్ ఏ దేశమంటే..?

ప్రపంచమంతా ఒకేసారి కాకుండా, వేర్వేరు సమయాల్లో నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తుంది. భూమి భ్రమణం, టైమ్ జోన్‌ల కారణంగా ఈ వైవిధ్యం ఏర్పడుతుంది. అందరికంటే ముందు ఏ దేశం న్యూఇయర వేడుకలు జరుపుకుంటుంది..? చిట్టచివరగా న్యూ ఇయర్‌ను జరుపుకునేది ఎక్కడ..? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా.. లాస్ట్ ఏ దేశమంటే..?
Which Country First Celebrates New Year
Krishna S
|

Updated on: Dec 26, 2025 | 5:12 PM

Share

మరి కొన్ని రోజుల్లో 2025 కాలగర్భంలో కలిసిపోనుంది. 2025కు వీడ్కోలు చెబుతూ 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే అందరం ఒకేసారి హ్యాపీ న్యూ ఇయర్ అని కేకలు వేయరని మీకు తెలుసా..? భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో సూర్యోదయం అయినట్లే, నూతన సంవత్సర వేడుకలు కూడా ఒక్కో చోట ఒక్కో సమయంలో మొదలవుతాయి. అసలు ప్రపంచంలోనే అందరికంటే ముందుగా కేక్ కట్ చేసేది ఎవరు? చిట్టచివరగా న్యూఇయర్ జరుపుకునేది ఎక్కడ? అనే వివరాలను తెలుసుకుందాం..

మొదటగా వేడుకలు జరిగేది ఇక్కడే..

ప్రపంచ పటంలో తూర్పున ఉండే కిరితిమతి ద్వీపం లేదా క్రిస్మస్ ఐలాండ్ నూతన సంవత్సరాన్ని అందరికంటే ముందుగా న్యూఇయర్ జరుపుకుంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దేశంలో భాగమైన ఈ ద్వీపంలో సుమారు 1.20 లక్షల జనాభా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడి గ్రామాల పేర్లు పారిస్, పోలాండ్, లండన్. ప్రపంచం ఇంకా డిసెంబర్ 31 రాత్రి పనుల్లో ఉండగానే ఇక్కడ అర్థరాత్రి 12 గంటలు దాటి 2026 ప్రారంభమవుతుంది.

న్యూజిలాండ్ – ఆస్ట్రేలియాలో సందడి

కిరితిమతి తర్వాత నూతన సంవత్సరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నగరాలను పలకరిస్తుంది. న్యూజిలాండ్ చాథమ్ దీవుల్లో భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 3:45 గంటలకే 2026 వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆక్లాండ్, వెల్లింగ్టన్ వంటి నగరాల్లో సాయంత్రం 4:30 గంటలకు వేడుకలు మొదలవుతాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రసిద్ధ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచా వెలుగులు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతాయి. అడిలైడ్, మెల్‌బోర్న్ నగరాల్లో కూడా దాదాపు ఇదే సమయంలో సంబరాలు జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లో వేడుకలు

మనం డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటలకు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయానికి.. జపాన్, కొరియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే తమ వేడుకలను ముగించుకుంటాయి. మనం వేడుకలు జరుపుకున్న తర్వాత ఐరోపా దేశాలు (లండన్, పారిస్), ఆ తర్వాత చివరగా అమెరికా ఖండం కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.

చిట్టచివరగా స్వాగతించేది ఎవరు?

ప్రపంచమంతా జనవరి 1 వేడుకల్లో మునిగిపోయినా పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికన్ సమోవా మాత్రం ఇంకా డిసెంబర్ 31నే ఉంటుంది. ఇది UTC-11 టైమ్ జోన్‌లో ఉండడం వల్ల ప్రపంచంలో అందరికంటే చివరగా ఇక్కడ నూతన సంవత్సరం మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం.. జనవరి 1వ తేదీ సాయంత్రం 4:30 గంటల సమయానికి అమెరికన్ సమోవాలో అర్థరాత్రి 12 గంటలు అవుతుంది. అంటే మనం జనవరి 1 లంచ్ ముగించే సమయానికి వారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు.

కాలం ఒకటే అయినా, భూమి తిరిగే వేగం మనకు ఈ వింతైన అనుభూతిని ఇస్తుంది. కిరితిమతిలో మొదలైన 2026 ప్రయాణం, అమెరికన్ సమోవాతో ముగుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు