AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డు Vs అరటిపండు.. బరువు పెరగడానికి రెండింటిలో ఏది బెస్ట్..?

Banana vs Eggs: చాలామంది బరువు తగ్గడానికి ఎంత కష్టపడతారో బరువు పెరగడానికి కూడా అంతే తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే మార్కెట్లో దొరికే కృత్రిమ పౌడర్లు, సప్లిమెంట్ల కంటే సహజమైన ఆహారంతో బరువు పెరగడం అత్యంత ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకునే వారు ప్రధానంగా ఎంచుకునేవి అరటిపండ్లు, గుడ్లు. కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందనే అంశంపై పోషకాహార నిపుణురాలు ప్రియా పాలివాల్ కీలక విషయాలు వెల్లడించారు.

Krishna S
|

Updated on: Dec 25, 2025 | 8:18 PM

Share
బరువు పెరగడం ప్రారంభించే వారికి అరటిపండు ఒక వరం లాంటిది. ఇందులో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, అధిక కేలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి వెనువెంటనే శక్తిని ఇస్తాయి. ఇది సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని తీసుకోవచ్చు. పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 పుష్కలంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

1 / 5
శరీరం దృఢంగా మారాలి, కండరాలు పెరగాలి అనుకునే వారికి గుడ్లు మంచి ఆహారం. గుడ్లలో హై-క్వాలిటీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ డి వంటి అవసరమైన ఖనిజాలు ఇందులో లభిస్తాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. వ్యాయామం చేసేవారు రోజుకు 2 నుండి 4 గుడ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరుగుతారు.

2 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు పెరగడం అంటే కేవలం ఎక్కువగా తినడం కాదు.. అది సమతుల్య పోషకాహారం అయి ఉండాలి. తప్పుగా బరువు పెరగడం వల్ల బొడ్డు దగ్గర కొవ్వు పేరుకుపోవడం, శరీర బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అందుకే కేలరీలు, ప్రోటీన్, విటమిన్లు అన్నీ అందేలా చూసుకోవాలి.

3 / 5
మరి ఏది బెస్ట్: అరటిపండ్లు కేలరీలను ఇస్తే.. గుడ్లు కండరాలను నిర్మిస్తాయి. కాబట్టి రెండింటినీ కలిపి తీసుకోవడం అత్యంత ప్రయోజనకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను ఏకకాలంలో అందిస్తుంది.

4 / 5
కేవలం వీటిపైనే ఆధారపడకుండా మీ ఆహారంలో పప్పులు, పాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోండి. వీటితో పాటు తగినంత నిద్ర, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేస్తేనే ఆరోగ్యకరమైన బరువు మీ సొంతమవుతుం

5 / 5