AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lemon Peels: నిమ్మ తొక్క పనికిరాదని పడేస్తున్నారా? ఎన్నెన్ని లాభాలో తెలుసా..

నిమ్మ కాయల గురించి తెలియని వారుండరు. వీటిని రోజు వారీ జీవితంలో అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. రోజువారీ ఆహారంలో నిమ్మ చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇదిసహాయపడుతుంది. చాలా మంది తమ భోజనంలో నిమ్మ రసం..

Srilakshmi C
|

Updated on: Dec 25, 2025 | 9:10 PM

Share
నిమ్మ కాయల గురించి తెలియని వారుండరు. వీటిని రోజు వారీ జీవితంలో అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. రోజువారీ ఆహారంలో నిమ్మ  చేర్చుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇదిసహాయపడుతుంది.

1 / 5
చాలా మంది తమ భోజనంలో నిమ్మ రసం కలిపి తినడానికి ఇష్టపడతారు. అందుకే నిమ్మ రసం లేకుండా చాలా మందికి భోజనం పూర్తి కాదు. భోజనంలో మాత్రమే కాదు నిమ్మ జ్యూస్ కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. నిమ్మకాయలో అత్యధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది.

2 / 5
విటమిన్ సి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయ మాత్రమే కాదు నిమ్మ తొక్క కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మ తొక్కలతో ఎన్నో పనులను సులువుగా చేయవచ్చు. నిమ్మ తొక్కలలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వాటిలో వివిధ రకాల ఫైబర్ కూడా ఉంటుంది.

3 / 5
అలాగే నిమ్మ తొక్కలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. నిమ్మ తొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిమ్మతొక్కతో  పాత్రలను శుభ్రం చేస్తే తళతళ లాడాల్సిందే. వేడినీటిలో  నిమ్మ తొక్కలు వేసి మరిగించి ఆ నీటిలో శుభ్రమైన గుడ్డ ముంచి శరీరంపై రుద్దితే దుర్వాసన పోతుంది. నిమ్మతొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకానికి చెక్ పెట్టొచ్చు. ఇది  ప్రేగు అల్సర్లను కూడా నయం చేస్తుంది.

4 / 5
ముఖ్యంగా ముఖంపై మొటిమల సమస్య నుంచి బయటపడటానికి నిమ్మ తొక్క పొడితో తయారు చేసిన ఫేస్ మాస్క్‌ వినియోగించవచ్చు. ఇది మొటిమల సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

5 / 5