జీన్స్ ప్యాంట్ బిగ్ పాకెట్‌లో మినీ పాకెట్ ఎందుకు? దీని వెనుక అసలు మ్యాటర్ తెలుసా?
చాలా మంది జీన్స్ ధరించేవారికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. జీన్స్ ప్యాంట్ ముందు కుడివైపు పెద్ద పాకెట్‌లో మరో చిన్న పాకెట్ ఉంటుంది. అయితే, ఆ చిన్న పాకెట్ ఎందుకు స్టిచ్ చేశారనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. చివరకు టైలర్స్ చెప్పిన అసలు కారణంతో చర్చ ఆసక్తికరంగా ముగిసింది.

జీన్స్ ప్యాంట్స్ ధరించే వారందరూ ఈ విషయంపై ఏ మాత్రం ఆలోచించి ఉండరు. తమ జీన్స్ ప్యాంట్‌కు ముందు కుడి వైపున ఒక పెద్ద పాకెట్ తోపాటు చిన్న పాకెట్ కూడా ఉంటుంది. అయితే, టైలర్లు ఆ జేబును ఎందుకు అదనంగా స్టిచ్ చేశారనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అనేక అంశాలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ నెటిజన్ స్మాల్ పాకెట్ అంశాన్ని చర్చకు తేవడం ఆసక్తిగా మారింది.
జీన్స్ ముందు భాగంలో కుడివైపున ఒక పెద్ద పాకెట్ లోపల మరో చిన్న పాకెట్ ఎందుకు ఉంటుంది? అని ధీరూసింగ్25 అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ప్రశ్న లేవనెత్తారు. దీనికి నెటిజన్ల నుంచి విచిత్రమైన సమాధానాలు వచ్చాయి. కొందరు నాణేలు వేసుకోవడానికి చెప్పగా.. మరికొందరు ఆ పాకెట్‌తో ఉపయోగం లేదన్నారు. ఇంకొందరు తమకు తెలియదని చెప్పారు.
ఈ పోస్టు వైరల్ కావడంతో చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే, జీన్స్ తయారు చేసే బ్రాండ్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమైతే ఈ చిన్న జేబు గురించి వెలువడలేదు. కానీ, ఈ చిన్న పాకెట్ స్టిచ్ చేయడానికి ఓ చారిత్రక కారణమైతే ఉంది.
జీన్స్‌లో చిన్న జేబును పాకెట్ వాచ్ పెట్టుకునేందుకు స్టిచ్ చేశారని తేలింది. 19వ శతాబ్దంలో జీన్స్ మార్కెట్లోకి వచ్చిన సమయంలో చేతి గడియారాలు లేవు. ఆ కాలంలో చాలా మంది ప్రజలు సమయాన్ని తెలుసుకునేందుకు పాకెట్ గడియారాలను తీసుకెళ్లేవారు. ఇది గమనించిన టైలర్లు పాకెట్ వాచెస్‌ను భద్రపర్చుకునేందుకు జీన్స్ ప్యాంట్ ముందు కుడివైపు జేబులో మరో చిన్న పాకెట్‌ను స్టిచ్ చేశారు. దీంతో పాకెట్ వాచ్‌లను జీన్స్ చిన్న పాకెట్‌లో పెట్టుకునేందుకు వీలు కలిగింది.
అయితే, కాలక్రమంలో పాకెట్ వాచ్‌లు కనుమరుగయ్యాయి. కానీ, జీన్స్‌లో మినీ పాకెట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ప్రస్తుత కాలంలో కూడా జీన్స్ అదే డిజైన్‌లో మనుగడ సాగిస్తోంది. జనరేషన్స్ మారినా ఆ పాకెట్ మాత్రం అలాగే ఉండిపోయింది.