మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్..
డయాబెటిస్ నేడు చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ పీడిస్తోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణాలు. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా, వంటగదిలో లభించే ఉసిరి, మెంతులు, కాకరకాయ, పసుపు వంటి ఆయుర్వేద పదార్థాలతో రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ వ్యాధి నేడు చిన్నారులు, యువకులను సైతం పీడిస్తోంది. మారిన జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణాలు. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా మన వంటగదిలో లభించే కొన్ని అద్భుతమైన పదార్థాలతో దీనిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉసిరి
ఉసిరిలో ఉండే పోషకాలు ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల తాజా ఉసిరి రసం లేదా ఒక టీస్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా తోడ్పడుతుంది.
మెంతులు – దాల్చిన చెక్క
మెంతులు, దాల్చిన చెక్క కేవలం వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక టీస్పూన్ మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి గింజలను నమలాలి. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు లేదా 1/4 టీస్పూన్ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగవచ్చు.
కాకరకాయ
కాకరకాయ చేదుగా ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక ఔషధం. ఇందులో పాలీపెప్టైడ్-పి అనే సహజ ఇన్సులిన్ లాంటి సమ్మేళనం ఉంటుంది. ఇది కఫం, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. రోజూ ఖాళీ కడుపుతో 30 మి.లీ తాజా కాకరకాయ రసం తాగితే షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.
పసుపు
పసుపు కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా శరీరంలో వాపును తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ అర టీస్పూన్ పసుపును గోరువెచ్చని నీటిలో లేదా పాలలో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
డయాబెటిస్‌ను నియంత్రించడంలో ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా అంతే ముఖ్యం. పైన పేర్కొన్న సహజ పద్ధతులను పాటిస్తూనే క్రమం తప్పకుండా డాక్టరును సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జీవనశైలితో డయాబెటిస్ ఉన్నప్పటికీ హాయిగా జీవించవచ్చు.
(ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం మీ అవగాహన, సాధారణ సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




