White Bed Sheets: హోటల్ రూమ్స్‌లో తెల్లటి బెడ్‌షీట్స్ మాత్రమే ఎందుకు వాడుతారో తెలుసా?
మనం ఏదైనా టూర్‌కు వెళ్లినప్పుడూ, లేదా ఏదైనా పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ హోట్స్‌లో స్టే చేస్తూ ఉంటాం. అయితే అక్కడి రూమ్‌లో ఉండే బెడ్ షీట్స్‌పై ఎక్కువగా తెల్లటి బెడ్‌షీట్‌లు వాడటం మీరు గమనించే ఉంటారు. కానీ కేవలం తెల్లటి బెడ్‌షీట్స్ మాత్రమే ఎందుకు వాడుతారని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే దీని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

భారతదేశంలో చాలా ఖరీదైన హోటళ్ళు ఉన్నాయి. కొన్ని హోటళ్ళలో, మీకు ఇంట్లో కంటే మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. కానీ మనం అక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం వెళ్లిన ప్రతి హోటల్‌లో, అది చిన్న హోటల్ అయినా లేదా సెవెన్ స్టార్ హోటల్ అయినా, బెడ్‌పై తెల్లటి బెడ్ షీట్స్‌ను మాత్రమే వాడుతారు. ఈ విధంగా తెల్లటి బెడ్ షీట్లను మాత్రమే వాడడానికి ప్రధాన కారణం శుభ్రత. కస్టమర్లను ఆకర్షించడం. అవును గది శుభ్రంగా ఉందని అతిథికి అనిపించేలా బెడ్ పై తెల్లటి బెడ్ షీట్లను వేస్తారు.
తెలుపు రంగు ఎప్పుడూ గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. మంచం మీద తెల్లటి బెడ్ షీట్ ఉంటే, కస్టమర్ తన గౌరవాన్ని కాపాడుకుంటున్నట్లు భావిస్తాడు. అలాగే, తెలుపు రంగును చూడటం వల్ల కస్టమర్ కు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కస్టమర్ గదిలోకి అడుగుపెట్టిన వెంటనే అతనికి, మంచం మీద తెల్లటి బెడ్ షీట్ కనిపిస్తుంది. ఇది అతని పాజిటీవ్ అభిప్రాయాన్ని కలిగిస్తుంది. .
తెల్లటి బెడ్ షీట్ పై మరక వెంటనే కనిపిస్తుంది. అందుకే హోటళ్ళు బెడ్ లపై తెల్లటి బెడ్ షీట్లు వేస్తాయి, తద్వారా బెడ్ పై ఉన్న మురికి, బెడ్ షీట్ పై ఉన్న మరకలు త్వరగా కనిపిస్తాయి. తెల్లటి బెడ్ షీట్లు గదిని విలాసవంతంగా, విశాలంగా కనిపించేలా చేస్తాయి. అలాగే, తెల్లటి బెడ్ షీట్లను చూసినప్పుడు ప్రతికూల భావోద్వేగాలు తగ్గుతాయి. అందుకే ప్రతి హోటల్‌లో బెడ్‌పై తెల్లటి బెడ్ షీట్‌లు ఉంటాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
