AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti : మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఈ అలవాట్లే ప్రధాన కారణం కావచ్చు!

ఇంట్లో చిన్ని చిన్న గొడవలు అనేవి సహజం. ఇవి మన్పర్ధాలు, బేదాభిప్రయాల కారణంగా జరుగుతాయి. కానీ ఇంట్లో తరచూ ఏవో గొడవలు జరుగుతూ ఉంటే.. అది మీ కుటుంబానికినే కాదు.. ఇంటి సంపద, శాంతికి కూడా పెను ముప్పు కావచ్చు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇవి విభేదాలు, గొడవలకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుంటే.. ఈ సమస్యల నుంచి బయటపడి ఇంట్లో ఆనందం, శాంతి ఖచ్చితంగా నెలకొంటాయని అన్నారు. ఇంట్లో తరచూ గొడవలకు కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

Chanakya Niti : మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఈ అలవాట్లే ప్రధాన కారణం కావచ్చు!
Relationship Problems At Home
Anand T
|

Updated on: Dec 26, 2025 | 2:08 PM

Share

ఈ ప్రపంచంలో ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన ఇళ్లే.. మనకు ఇక్కడ ఉన్నంత స్వేచ్చ మరెక్కడ దొరకదు. ఎందుకంటే అక్కడ మనం మనకు ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. కానీ కొన్ని సార్లు ఇళ్లు కూడా మనకు నరకంలా అనిపిస్తుంది. అవునూ ఇంట్లో తరచూ ఏవో ఒక గొడవలు జరుగుతుంటే.. మనకు ఇంటికి వెళ్లాలనిపించదు. కాబట్టి మనం ఇంట్లో గొడవలకు కారణాలేంటో తెలుసుకుంటే వాటిని ఈజీగా పరిష్కరించుకోవచ్చు.

ఇంట్లో తగాదాలకు ఈ తప్పులే ప్రధాన కారణం

స్వార్థం: ఒక ఇంట్లో గొడవలు మొదలు కావడానికి ప్రధానం కారణం స్వార్థం. ముఖ్యంగా నేను మాత్రమే ఎందుకు పనిచేయాలి, ప్రతిదీ నేనే చేస్తున్నాను, ఇల్లు నేనే నడుపుతున్నాను అనే స్వార్థం, అహంకారం ఇంట్లో గొడవలకు దారితీస్తుంది. ఇంట్లోని ఒక వ్యక్తి ఎప్పుడైతే తన స్వంత ప్రయోజనం కోసం ఆలోచిస్తాడో.. అది కుటుంబ ఐక్యతను నాశనం చేస్తుంది. కాబట్టి మీరు “నేను” అనే అహాన్ని పక్కన బెట్టి “మనం, మనకోసం” అని కలిసి ఆలోచించినప్పుడు మాత్రమే ఇంట్లో శాంతి నెలకొంటుందని చాణక్యుడు చెప్పాడు.

అగౌరవం, నిర్లక్ష్యం: ఇంట్లోని వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోకపోవడం, ఒక మాటలకు మరొకరు విలువ ఇవ్వకపోవడం అనేది కూడా ఇంట్లో గొడవలకు దారి తీస్తుంది. దీని కారణంగా, సంబంధంలో చీలిక ఏర్పడి, ఆగ్రహం తలెత్తుతుందని చాణక్యుడు చెబుతున్నాడు. మద్యం సేవించేటప్పుడు కుటుంబ సభ్యుల మాటలు వినడం, గౌరవించడం ద్వారా సంబంధాలు బలోపేతం అవుతాయి.

అబద్ధాలు, మోసం: నమ్మకం ఏ సంబంధానికైనా పునాది. అటువంటి పరిస్థితిలో, మీరు చెప్పే చిన్న అబద్ధాలు, మోసాలు కూడా మీ మధ్య చీలికలకు కారణం కావచ్చు.చాణక్యుడి ప్రకారం, అబద్ధాలు, మోసం కుటుంబానికి గొప్ప ప్రమాదాన్ని కలిగిస్తాయి. నిజాయితీతో నిండిన ఇంట్లో మాత్రమే శాంతి నెలకొంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ మీ దగ్గరి వాళ్లతో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి.

మూడో వ్యక్తి జోక్యం: ఇంటి విషయాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇది చాలా ప్రమాదకరమని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. మీ ఇంటి విషయాల్లో మూడవ పక్షం జోక్యం చేసుకుంటే, ఖచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి, కుటుంబ సభ్యుల మధ్య సంబంధం దెబ్బతింటుంది. అలాంటి తప్పులు జరగకుండా చూసుకోండి.

గర్వం, కోపం: అహంకారం, క్షణికావేశం ఇవి కూడా ఇంట్లో గొడవలకు ప్రధాన కారణం. అంటే అంతా నాకే తెలుసు, నాకు ఎవరూ చెప్పాల్సిన అవసం లేదు, నేను ఎవరి మాట వినను అనే అహంకారం కుటుంబంలో ఎవరికి ఉన్న ఆ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతాయి. కాబట్టి, మీరు మీ గర్వాన్ని పక్కన పెట్టి, మీ కుటుంబాన్ని ఓపికగా, ప్రేమగా చూసుకున్నప్పుడే, మొత్తం కుటుంబం సంతోషంగా ఉండగలదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'