పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో..వీడియో
మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సెన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో దాదాపు 30,000 మందికి ఆతిథ్యమిచ్చారు. ఈ వేడుకలో వెయ్యి మంది వంటవాళ్లు తమ ప్రావీణ్యాన్ని చూపించారు. సాంచి ఎమ్మెల్యే డాక్టర్ ప్రభు రామ్ చౌదరి పెద్ద కుమారుడు పర్వ్ చౌదరి వివాహం ఇటీవల భోపాల్‌లో నిరాడంబరంగా జరిగింది. రిసెప్షన్‌ను మాత్రం రాయ్‌సెన్‌లో భారీ ఎత్తున నిర్వహించారు. సుమారు ఎనిమిది ఎకరాల్లో వేదికను ఏర్పాటు చేశారు. ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీశ్ దేవ్డా, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, ఇతర సీనియర్ నేతలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ముప్పై వేల మంది అతిథుల కోసం వెయ్యి మంది వంటవాళ్లు దేశీ, విదేశీ వంటకాలను సిద్ధం చేశారు. రాయ్‌సెన్‌లో ఇంత పెద్ద వేడుక ఎప్పుడూ జరగలేదని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడి వివాహ వేడుక కొద్దిరోజుల క్రితం చాలా నిరాడంబరంగా జరిగింది. ముఖ్యమంత్రి చిన్న కుమారుడు డాక్టర్ అభిమన్యు తన చిరకాల స్నేహితురాలు డాక్టర్ ఇషితా పటేల్‌ను ఉజ్జయినిలో వివాహం చేసుకున్నారు. బాబా రామ్‌దేవ్ మంత్రాలు చదువుతుండగా పూలదండలు మార్చుకుని నిరాడంబరంగా వివాహ తంతును ముగించారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
వైరల్ వీడియోలు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో
