రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే వేధింపులకు పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? పరిస్థితుల దృష్ట్యా రైళ్లలో మహిళలు సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణిస్తారు. అది పోలీసు వ్యవస్థ తమకు రక్షణగా ఉందనే ఓ నమ్మకంతో.. కానీ కొందరు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన. చెన్నైనుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఓ విద్యార్ధినిపై ఓహెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ప్రయాణికుడిగా ఉన్న ఆ పోలీసు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలకు దారితీసింది.బాధిత విద్యార్థిని అత్యంత ధైర్యంగా ఆ పోలీసు దుశ్చర్యను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసింది. రైలు ప్రయాణంలో ఉండగానే ఆ వీడియోను రైల్వే పోలీసు ఫోర్స్ కు పంపింది. ఆమె ఫిర్యాదు, వీడియో ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించారు. రైలు కాట్పాడి జంక్షన్‌కు చేరుకోగానే నిందితుడైన పోలీసును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కోయంబత్తూర్ నగర పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆర్‌ఎస్ పురం పోలీస్ స్టేషన్‌కు చెందిన సదరు హెడ్ కానిస్టేబుల్‌ను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ కేసు కాట్పాడి రైల్వే పోలీసుల వద్ద ఉంది. వారు విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని, ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఆరోపణలు రుజువైతే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
