గడిచిన దశాబ్దంలో అద్భుత ఆర్థిక వృద్ధిని సాధించి, శాంతియుతంగా ఉన్న బంగ్లాదేశ్ నేడు తీవ్ర అశాంతితో రగులుతోంది. గతంలో టెక్స్టైల్ రంగంలో పురోగమించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన ఈ దేశంలో ప్రస్తుతం హత్యలు, హింస చోటు చేసుకుంటున్నాయి. 2022లో 94వ స్థానంలో ఉన్న హ్యాపీనెస్ ఇండెక్స్ 134వ స్థానానికి పడిపోయింది. ఈ సంక్షోభం నుండి బంగ్లాదేశ్‌ను ఎవరు రక్షిస్తారు?