AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology 2026: శుక్రుడి అనుకూలత.. కొత్త సంవత్సరంలో ఈ రాశులకు సకల శుభాలు!

Venus Blessings 2026: భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు అనుకూలంగా ఉన్న పక్షంలో సంవత్సరమంతా నిత్యకల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశుల వారు కొత్త సంవత్సర ప్రారంభంలోనే శుక్రుడికి ప్రసన్నుడిని చేసుకోవడం ద్వారా ఏడాదంతా సుఖంగా, సౌకర్యవంతంగా జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన ఆరు రాశులకు శుక్రుడు అనుకూల గ్రహమైనందువల్ల వారికి శుక్రుడి వల్ల నష్టం ఉండే అవకాశం లేదు. పైన పేర్కొన్న రాశులు లలితా సహస్ర నామస్తోత్రాన్ని పఠించడం, శుక్రుడికి కందులు దానం చేయడం, వజ్రం పొదిగిన ఉంగరం ధరించడం వంటివి చేయడం చాలా మంచిది.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2025 | 3:02 PM

Share
మేషం: ఈ రాశికి ధన, సప్తమాధిపతి అయిన శుక్రుడు ధన వృద్ధికి, కుటుంబంలో సుఖ సంతోషాలకు, ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్య జీవితానికి సంబంధించిన గ్రహం. జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన కారకత్వాలు కలిగిన శుక్రుడిని ఈ రాశివారు హ్యాపీగా ఉంచితే అంత మంచిది.  శుక్ర గ్రహం అనుకూలంగా మారడం వల్ల తేలికగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కుటుంబ, దాంపత్య జీవితాలు సుఖమయం అవుతాయి. భోగభాగ్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి కుటుంబ జీవితాన్ని, గృహ, వాహనాలను, ఆస్తిపాస్తులను, హోదాను ఇచ్చే గ్రహం శుక్రుడు. అందువల్ల ఈ రాశివారు ఈ శుక్రుడిని ఎంత తృప్తి పరిస్తే అంత మంచిది. ఈ ఏడాదంతా శుక్రుడు అనుకూలంగా ఉండాలన్న పక్షంలో దుర్గాదేవిని తరచూ స్తుతించడం మంచిది. వీరికి ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత కుటుంబ జీవితం ఏర్పడుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరి ష్కారమవుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

2 / 6
సింహం: ఈ రాశివారికి ఉద్యోగంలో స్థిరత్వంతో పాటు పురోగతి ఉండాలన్నా, ఉద్యోగం లభించాలన్నా, ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం కావాలన్నా శుక్రుడి అనుగ్రహం తప్పనిసరి. ఈ రాశివారు ఈ ఏడాదంతా శుక్రుడి అనుకూలత కోసం శుక్రుడి విగ్రహానికి ప్రదక్షిణలు చేయడం, శుభ కార్యాలకు సహాయం చేయడం, వజ్రం పొదిగిన ఉంగరం ధరించడం మంచిది. వీరి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమై, కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా ఒక వెలుగు వెలుగుతాయి.

3 / 6
వృశ్చికం: ఈ రాశివారికి మంచి పెళ్లి సంబంధం కుదరాలన్నా, ప్రేమ వ్యవహారాలు విజయవంతం కావాలన్నా, దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోవాలన్నా, విదేశాల్లో ఉద్యోగం లభించాలన్నా తప్పని సరిగా శుక్రుడి అనుకూలత అవసరం. శుక్రుడి ఆశీస్సులు పొందడానికి వీరు లలితా సహస్ర నామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. వీరికి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రేమలు సక్సెస్ అవుతాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. విదేశీ ఉద్యోగం లభిస్తుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారికి ఆస్తులు సమకూరడం, ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం, విదేశాల్లో అవకాశాలు లభించడం వంటివి శుక్రుడి ద్వారానే జరగాల్సి ఉంటుంది. వజ్రం పొదిగిన ఉంగరం ధరించడం, గోదుమ రంగు దుస్తులు ధరించడం వల్ల శుక్రుడు అనుకూలంగా మారడం జరుగుతుంది. ఈ చిన్న ప్రయత్నంతో వీరి జీవితం తప్పకుండా నిత్య కల్యాణం, పచ్చతోరణంగా మారుతుంది.

5 / 6
మీనం: ఈ రాశివారు పురోగతి సాధించడానికి, ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం కావడానికి, ధన వృద్దికి, వారసత్వపు ఆస్తి లభించడానికి, దాంపత్య జీవితం అనుకూలంగా సాగడానికి, మనసులోని కోరి కలు నెరవేరడానికి శుక్రుడే కారకుడు. దుర్గాదేవిని రోజూ ధ్వానించడం వల్ల వీరికి శుక్రుడి అను గ్రహం ఈ ఏడాదంతా తప్పకుండా లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనుకున్నవన్నీ నెరవేరుతాయి.

6 / 6