బంగారం ధర 2026లో కుప్పకూలుతుందా..?
18 December 2025
Jyothi Gadda
ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు ఎప్పుడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. 24క్యారెట్ల మేలిమి బంగారం ధర ఏకంగా లక్షన్నర చేరువలోకి వచ్చింది.
ఈ క్రమంలోనే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాజా వ్యాఖ్యలు బంగారం భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.
2025లో బంగారం ధరలు చూపిన అద్భుతమైన ర్యాలీ 2026 వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి కారణం కేవలం ఒక అంశం మాత్రమే కాదన్నారు.
స్థూల ఆర్థిక పరిస్థితులు, బలమైన పెట్టుబడి డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రుణ భారం వంటి అనేక అంశాలు కారణంగా వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయని, ఇది బంగారంపై దీర్ఘకాలిక విశ్వాసాన్ని సూచిస్తుందని అన్నారు.
సంస్థాగత పెట్టుబడిదారులకే కాకుండా, వివిధ దేశాల్లో చోటు చేసుకున్న ప్రత్యేక పరిణామాలు కూడా డిమాండ్‌ను పెంచాయని వారు వివరించారు.
చైనాలో నియంత్రణ సడలింపులు, దాదాపు 30 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న జపాన్‌లో బంగారంపై ఆసక్తి పెరగడం,..
భారతదేశంలో గోల్డ్ ETFలలో పెట్టుబడులు భారీగా పెరగడం కూడా బంగారం ధర భారీగా పెరిగేలా చేస్తున్నాయని ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు.
అగ్రరాజ్యాల అప్పుల ప్రభావం బంగారంపై పడింది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు భారీ అప్పుల్లో ఉండటం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం.
మరిన్ని వెబ్ స్టోరీస్
24 క్యారెట్ల బంగారంలో పెట్టుబడి పెట్టడం లాభమా నష్టమా ?
ఆరోగ్యానికి అవిసె గింజల లడ్డు.. ఆ వ్యాధులకు వణుకే..!
కొబ్బరి పాలతో కోటి లాభాలు..!