బంగారం ధర రికార్డ్‌ బద్దలు.. వెండి ధర తెలిస్తే షాకవుతారు!

25 December, 2025

Subhash

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు రెట్టింపు పెరుగుతోంది.

బంగారం, వెండి

ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు షాకిస్తున్నాయి. వెండి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగకుండా పరుగులు పెడుతోంది.

ఆగని ధరలు

ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్షా 39 వేల 250 రూపాయల వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1 లక్షా 24 వేల 650 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుత ధరలు

ఇక వెండి కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. రూ.2,34,000 వద్ద ఉండగా, హైదరాబాద్‌, చెన్నై, కేరళలో అయితే రూ.2.45,000 వద్ద ట్రేడవుతోంది.

కిలో వెండి ధర

ఇక రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అమెరికన్ ఆర్థికవేత్త ఎడ్‌ యార్దేని చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

రానున్న రోజుల్లో 

రానున్న రోజుల్లో అంటే 2029 నాటికి తులం బంగారం ధర 3 లక్షల రూపాయల మార్క్‌ దాటే అవకాశం ఉందని చెప్పారు.

2029 నాటికి తులం ధర

ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర లక్షా 39 వేల 250 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇదే ధర విజయడలో ఉంది.

హైదరాబాద్‌లో తులం ధర

బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరల్లో తేడాలు ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం.

ఎందుకు పెరుగుతోంది?