ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో దారుణ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన రాకేష్.. తన భార్య మాయతో కలిసి 8 నెలల క్రితం పొట్టకూటి కోసం అనకాపల్లి జిల్లాకు వచ్చాడు. ఎలమంచిలిలో ఓ స్క్రాప్ దుకాణాన్ని లీజుకు తీసుకొని నిర్వహిస్తున్నాడు రాకేష్. అక్కడే భార్య నాలుగు నెలల చిన్నారితో కలిసి నివాసం ఉంటున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో.. సెల్ ఫోన్ కలహాన్ని నింపింది. మాయ.. సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుందని గమనించిన రాకేష్ పలుమార్లు ప్రశ్నించాడు. ఈ విషయంలో.. గత మూడు నెలలుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు నడుస్తూ ఉన్నాయి.
రోజూలాగే గురువారం ఉదయం రాకేష్ బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి భార్య మాయ.. ఫోన్ మాట్లాడుతూ లీనమైపోయింది. దాంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాకేష్.. ఆమెను మందలించాడు.. మాట మాట పెరిగింది. దీంతో.. మాయ తలను గోడకేసి కొట్టాడు రాకేష్. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న స్క్రూడ్రైవర్తో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు.. పక్కనే ఉన్న 4నెలల చిన్నారిని స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. మాయపై అనుమానంతోనే ఆమెను హత్య చేశాడని ఎలమంచిలి సిఐ ధనుంజయ తెలిపారు. తల్లిని కోల్పోవడంతో ఆ చిన్నారిని సంరక్షిస్తున్నారు నర్సులు, ఐసిడిఎస్ సిబ్బంది. తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్టి సపర్యలు చేశారు. మాయకు ఇంకో 12 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే ఆ బాలిక తన మొదటి భర్త సంతానం. ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది. ఇప్పుడీ ఘటనతో ఆ చిన్నారుల భవిష్యత్తు ఏమిటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
2025లో చక్ దే ఇండియా..వీడియో
వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో
చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో
మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
