Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అనేది భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్. ఇది ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం ద్వారా నిర్వహిస్తున్నారు. సిరీస్ డ్రా అయితే, ట్రోఫీని కలిగి ఉన్న దేశం వద్దే ట్రోఫీ ఉంటుంది. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్, భారతదేశానికి చెందిన సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు. వీరి కెరీర్‌లో 10,000 కంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేశారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు, భారత్, ఆస్ట్రేలియా 1947 నుంచి 1996 వరకు 49 సంవత్సరాల కాలంలో 50 సార్లు తలపడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భారతదేశాన్ని సందర్శించిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. అయితే, ఈ కాలంలో, రెండు దేశాల మధ్య పర్యటనలు యాషెస్‌లో వలె షెడ్యూల్ చేయలేదు. రెండు దేశాలు తరచుగా 10-15 సంవత్సరాల తర్వాత ఇరు దేశాల్లో పర్యటించడం మొదలెట్టాయి. ఈ 50 టెస్టుల్లో ఆస్ట్రేలియా 24 సార్లు గెలుపొందగా, భారత్ 8 సార్లు గెలుపొందగా, 1 టెస్టు టై కాగా, మిగిలిన 17 టెస్టులు డ్రా అయ్యాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఇంకా చదవండి

Rohit: ఆసీస్‌లో ఆ బౌలర్‌ను ఎదర్కోవడం చాలా కష్టం..భారత్‌ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి, ఆస్ట్రేలియా బౌలింగ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అజట్టులో పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్‌ ప్లేయర్స్‌ను మించిన బౌలర్ ఉన్నారన్నారు. స్కాట్‌ బోలాండ్‌ను ఆస్ట్రేలియా జట్టులో కఠినమైన బౌలర్‌గా రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అతన్ని ఎదుర్కోవడం భారత్‌కు చాలా కష్టతరమైందన్నారు.

  • Anand T
  • Updated on: Apr 17, 2025
  • 5:17 pm

Kohli’s Shoes: కోహ్లీ షూస్ వేసుకొని ఆ సెంచరీ చేశా! సీక్రెట్ బయటపెట్టిన SRH ఊర మాస్ ప్లేయర్

నితీష్ కుమార్ రెడ్డి మెల్‌బోర్న్ టెస్ట్‌లో 171 బంతుల్లో మెరుపు సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్‌తోనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్టు నితీష్ వెల్లడించాడు. 80,000 మంది అభిమానుల మధ్య తన తండ్రి ఆనందంతో కనిపించడం తనకు భావోద్వేగ క్షణంగా నిలిచిందని చెప్పాడు. ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న నితీష్, కోహ్లీ ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాడు.

  • Narsimha
  • Updated on: Mar 21, 2025
  • 7:23 am

Pat Cummins: రెండోసారి తండ్రైన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.. బిడ్డకు ఏం పేరు పెట్టాడో తెలుసా?

గాయం కారణంగా ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స ట్రోఫికి దూరమయ్యాడీ స్టార్ క్రికెటర్. దీంతో నిరాశలో ఉన్న అభిమానులకు ఒక శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ స్టార్ క్రికెటర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Rohit Sharma: టీమిండియా దిగ్గజం మాటలకు నొచ్చుకున్న రోహిత్.. బీసీసీఐకి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పీడకలలా మారింది. ఈ పర్యటనలో హిట్ మ్యాన్ పై చాలా విమర్శలు వచ్చాయి. అతని నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఓ టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విమర్శలతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం.

ఆస్ట్రేలియాలో హీరో.. ఛాంపియన్స్ ట్రోఫీకి విలన్.. తెలుగబ్బాయ్‌కి హ్యాండిచ్చిన సెలెక్టర్లు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్

Champions Trophy 2025 Squad: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని పేర్లు చేర్చిన సెలెక్టెర్లు, ఫాంలో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నితీష్ కుమారె రెడ్డి, సంజూ శాంసన్ పేర్లు వినిపిస్తున్నాయి.

Video: క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. అభిమానికి ఊహించని ప్రమాదం

Sam Konstas: యువ పేసర్ సామ్ కాన్స్టాస్ ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించాడు. విరాట్ కోహ్లీతో గొడవ పడిన సామ్, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు. ఈ రెండు ఈవెంట్లతో కాన్స్టాస్ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలనంగా మారాడు.

BCCI: ఓ టీమిండియా ప్లేయర్ భార్య చేసిన తప్పు.. కట్‌చేస్తే.. ఇకపై విదేశీ పర్యటనలకు నో ఛాన్స్ అంటోన్న బీసీసీఐ

Indian Player Spouse Made Video: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 3-1 తేడాతో ఓటమిపాలైంది. 10 ఏళ్ల తర్వాత ఇలాంటి ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమైంది. ఈ క్రమంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది.

Team India: ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. టీమిండియా నుంచి ఆ ముగ్గురు ఔట్?

Virat Kohli, Rohit Sharma: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్‌లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత వారిని టీమిండియా నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కోచ్ గౌతమ్ గంభీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా కోరుతున్నారు.

SL vs AUS: టీమిండియాపై అదరగొట్టాడు.. కట్‌చేస్తే.. 7 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ

Steve Smith Captain: శ్రీలంక పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు తన జట్టును ప్రకటించింది. ఈ రెండు టెస్టుల సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు బాధ్యతలు చేపట్టబోతున్నాడు. శాండిల్ పేపర్ వివాదం తర్వాత ఓ పూర్తి సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Travis Head: అందుకే 3 నెలలుగా మద్యం తాగలే..: ట్రావిస్ హెడ్ షాకింగ్ కామెంట్స్

Travis Head Key Comments on Team India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే, త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హీరోగా నిలిచిన ట్రావిస్ హెడ్.. ఓ కీలక ప్రకటన చేశాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..