Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli’s Shoes: కోహ్లీ షూస్ వేసుకొని ఆ సెంచరీ చేశా! సీక్రెట్ బయటపెట్టిన SRH ఊర మాస్ ప్లేయర్

నితీష్ కుమార్ రెడ్డి మెల్‌బోర్న్ టెస్ట్‌లో 171 బంతుల్లో మెరుపు సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్‌తోనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్టు నితీష్ వెల్లడించాడు. 80,000 మంది అభిమానుల మధ్య తన తండ్రి ఆనందంతో కనిపించడం తనకు భావోద్వేగ క్షణంగా నిలిచిందని చెప్పాడు. ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న నితీష్, కోహ్లీ ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాడు.

Kohli’s Shoes: కోహ్లీ షూస్ వేసుకొని ఆ సెంచరీ చేశా! సీక్రెట్ బయటపెట్టిన SRH ఊర మాస్ ప్లేయర్
Nithis Kumar Reddy
Follow us
Narsimha

|

Updated on: Mar 21, 2025 | 7:23 AM

భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన క్షణాన్ని గుర్తుచేసుకున్నాడు. తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్ వేసుకుని మెల్‌బోర్న్ టెస్ట్‌లో తన తొలి సెంచరీ సాధించానని ఈ యువ ఆటగాడు వెల్లడించాడు. నితీష్ ఇటీవల ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో తన టెస్ట్ అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి, తొలి సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో 171 బంతుల్లో మెరుపు సెంచరీ సాధిస్తూ భారత జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా, 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేయడం చాలా అరుదైన విషయమే. ఈ అద్భుత ప్రదర్శన వెనుక కోహ్లీ ఇచ్చిన షూ కీలకమైనదని నితీష్ చెబుతున్నాడు.

“విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్‌తోనే మెల్‌బోర్న్‌లో సెంచరీ సాధించాను,” అని నితీష్ వివరించాడు. “లాకర్ రూమ్‌లో కోహ్లీ… సర్ఫరాజ్ ఖాన్‌ను చూసి నీ షూ సైజ్ ఎంత? అని అడిగాడు. దానికి సర్ఫరాజ్ ‘9’ అని బదులిచ్చాడు. తర్వాత కోహ్లీ నా వైపు చూశాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నా షూ సైజ్ 9 కాకపోయినా, మనసులో కోహ్లీ షూస్ నాకు రావాలని ఆశించాను. కోహ్లీ నన్ను అడిగిన వెంటనే, నేను 10 అని చెప్పాను. వెంటనే కోహ్లీ తన షూస్ నాకు ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో ఆ షూస్ వేసుకుని బ్యాటింగ్‌కు దిగాను. అదే టెస్ట్‌లో నా తొలి సెంచరీ నమోదు చేయగలిగాను” అని నితీష్ ఆనందంతో చెప్పుకొచ్చాడు.

“మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ చేసిన వెంటనే, నేను నా నాన్న ముత్యాల రెడ్డిని వెతికాను. 80,000 మంది ప్రేక్షకుల మధ్య ఆయనను గుర్తించడం చాలా కష్టం. కానీ కొద్ది సేపటికి బిగ్ స్క్రీన్‌లో ఆయన ఆనందభాష్పాలతో కనిపించారు. ఆ దృశ్యం చూసి నేను భావోద్వేగానికి గురయ్యాను” అని నితీష్ చెప్పాడు.

ఈ యువ తెలుగు ఆటగాడు తొలి టెస్ట్ సిరీస్‌లోనే తన ప్రతిభను నిరూపించుకోవడంతో భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు, ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్న నితీష్, ఈ ఫార్మాట్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చూపాలని భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూస్ మాదిరిగానే, ఆయన ప్రేరణ కూడా తన కెరీర్‌లో విజయాలను అందించాలి!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..