AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్ట్రేలియాలో హీరో.. ఛాంపియన్స్ ట్రోఫీకి విలన్.. తెలుగబ్బాయ్‌కి హ్యాండిచ్చిన సెలెక్టర్లు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్

Champions Trophy 2025 Squad: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని పేర్లు చేర్చిన సెలెక్టెర్లు, ఫాంలో ఉన్న ప్లేయర్లను పక్కన పెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నితీష్ కుమారె రెడ్డి, సంజూ శాంసన్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఆస్ట్రేలియాలో హీరో.. ఛాంపియన్స్ ట్రోఫీకి విలన్.. తెలుగబ్బాయ్‌కి హ్యాండిచ్చిన సెలెక్టర్లు.. ఫైరవుతోన్న ఫ్యాన్స్
Nithis Kumar Reddy
Venkata Chari
|

Updated on: Jan 18, 2025 | 5:13 PM

Share

Champions Trophy 2025 Squad: ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో చాలామంది ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో రాణించిన తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డికి అవకాశం దక్కలేదు. పెర్త్ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన నితీష్ రెడ్డి.. మొత్తం 5 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 298 పరుగులు చేశాడు. ఇందులో తొలి సెంచరీ (114) కూడా ఉంది. ఇటు ఐపీఎల్, అటు భారత జట్టు తరపున టీ20, టెస్ట్‌ల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ తెలుగబ్బాయ్‌కి నిరాశే ఎదురైంది. నితీష్‌తోపాటు సంజూ శాంసన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించారు.

ఇక భారత జట్టు స్వ్కాడ్ గురించి మాట్లాడితే, శుభ్‌మన్ గిల్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు ఇక జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ జట్టు మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నాడు. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్‌కు బ్యాకప్‌గా ఉంటాడు. అలాగే, వికెట్ కీపింగ్ చేయనున్నాడు.

అత్యంత ప్రీమియం వైట్-బాల్ ప్లేయర్లలో, హార్దిక్ పాండ్యా పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా, రవీంద్ర జడేజా స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా ఉండనున్నారు. జడేజాకు బ్యాకప్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. నాణ్యమైన ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడంతోపాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వచ్చాడు.

దుబాయ్‌లోని ట్రాక్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, పిచ్ స్లో బౌలర్‌లకు సహాయం చేస్తే భారతదేశం XIలో వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఆడగలడు. కొంతకాలంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న కుల్దీప్ యాదవ్, తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇన్నాళ్లూ జరిగినట్లుగానే మిడిల్ ఓవర్లలో ప్రధాన వికెట్ టేకర్ అవుతాడని టీం భావిస్తోంది.

మహమ్మద్ షమీ కూడా రీఎంట్రీ.. ఫిట్‌నెస్‌ను బట్టి అందుబాటులోకి బుమ్రా..

ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల T20I జట్టులో భాగమైన మహమ్మద్ షమీ ODI జట్టులోనూ చేరాడు. జస్ప్రీత్ బుమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి చేర్చారు. అయితే ప్రీమియర్ పేసర్ కోలుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా ఇంగ్లండ్ సిరీస్‌లో భాగమవుతాడు.

బుమ్రా వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. కానీ, ఇటీవల తీవ్రమైన ఆందోళనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీసీ ఈవెంట్ మొదలయ్యే సమయానికి కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..