Karun Nair: నువ్వు ఎంత ట్రై చేసిన ఇండియా తరుపున ఆడే అవకాశం రాదు! మాజీ వికెట్ కీపర్ హాట్ కామెంట్స్
కరుణ్ నాయర్ విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటుతూ వరుసగా అద్భుత సెంచరీలతో ఆకట్టుకుంటున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు నాట్ అవుట్ గా నిలిచిన అతని ప్రదర్శన ప్రశంసనీయం. భారత జట్టులోకి నాయర్ తిరిగి రావడం పై చర్చలు ప్రారంభమయ్యాయి, అయితే ఇప్పటికే ఉన్న స్థిరమైన జట్టులో చోటు దక్కడం కష్టం అని దినేష్ కార్తిక్ అన్నారు. యశస్వి జైస్వాల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకుండా విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం అని దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను ఇప్పటివరకు 112, 44, 163, 111, 112, 122, 88 స్కోర్‌లతో తన మేటి బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏడూ సార్లు నాట్ అవుట్ గ నిలిచి, ఒక్కసారి మాత్రమే అవుట్ కావడం విశేషం. ఈ రికార్డులతో భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశంపై చర్చలు మొదలయ్యాయి.
కాగా, భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, నాయర్ ప్రదర్శనను ప్రశంసిస్తూ, జట్టులోకి తక్షణం ఎంపిక అయ్యే అవకాశాలు తక్కువ అని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, “భారత వన్డే జట్టులో ఇప్పటికే స్థిరమైన ఆటగాళ్లు ఉన్నారు. మార్పులే చాలా తక్కువగా ఉంటాయి. అయితే, నాయర్ తన ప్రదర్శనతో చర్చలకు దారి తీస్తాడు అనడంలో సందేహం లేదు,” అని పేర్కొన్నారు. కరుణ్ నాయర్ ప్రస్తుతం జట్టులోకి రావడం కష్టమే అయినప్పటికీ, అతని ప్రదర్శన అభినందనీయం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు దాదాపుగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇక ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు యశస్వి జైస్వాల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదన్న అంశంపై కార్తీక్ స్పందించారు. “ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతనికి విశ్రాంతి అవసరం. 5 మ్యాచ్‌ల సిరీస్, టెస్టు క్రికెట్ ఆడటం అలవాటుగా ఉండదు. సెలెక్టర్లు అతడిని సమర్థంగా విశ్రాంతి ఇవ్వడం సరిగా చేశారు,” అని అన్నారు. యశస్వి జైస్వాల్‌ను ODI సిరీస్‌కు ఎంపిక చేయడం సరైన నిర్ణయం అని పేర్కొన్నారు.
ఈనో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 న ప్రారంభం కానుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లలో ఒకటి. ఇది ఒక అంతర్జాతీయ వన్డే టోర్నమెంట్, సాధారణంగా ఎనిమిది అత్యుత్తమ జట్లు ఇందులో పాల్గొంటాయి.
ఇది మొదటగా 1998లో ప్రారంభమైంది. 2017లో చివరిసారిగా ఈ టోర్నమెంట్ జరిగింది. అందులో పాకిస్తాన్ భారత్ పై ఫైనల్లో గెలిచి ట్రోఫీ గెలుచుకుంది. 2025లో ఇది మళ్ళీ ప్రారంభం కానుంది. ఈసారి పాకిస్థాన్, యూఏఈ ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శించేందుకు పోటీపడతాయి, అది ప్రపంచకప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక పోటీగా నిలుస్తుంది.
భారత జట్టులో ఇప్పటికే పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎక్కువ మార్పులు లేకుండా జట్టును సిద్ధం చేస్తారనే అభిప్రాయం ఉంది. కరుణ్ నాయర్, యశస్వి వంటి ఆటగాళ్లు భవిష్యత్తులో భారత జట్టుకు బలమైన మద్దతుగా నిలవవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



