AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. అభిమానికి ఊహించని ప్రమాదం

Sam Konstas: యువ పేసర్ సామ్ కాన్స్టాస్ ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించాడు. విరాట్ కోహ్లీతో గొడవ పడిన సామ్, ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో వాగ్వాదానికి దిగాడు. ఈ రెండు ఈవెంట్లతో కాన్స్టాస్ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలనంగా మారాడు.

Video: క్రికెటర్‌తో సెల్ఫీ కోసం ఆరాటం.. కట్‌చేస్తే.. అభిమానికి ఊహించని ప్రమాదం
Selfie With Sam Konstas
Venkata Chari
|

Updated on: Jan 16, 2025 | 3:07 PM

Share

Sam Konstas: భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తన తుఫాన్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా యువ పేసర్ సామ్ కాన్స్టాస్ చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ యువ ప్లేయర్‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల ప్రేమను పొందాడు. ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ అభిమాని చేసిన హాడావుడితో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అభియాన్ ఫొటో క్లిక్ చేసే హడావుడిలో ప్రమాదానికి గురయ్యాడు. సామ్ కాన్స్టాస్ తన బ్యాటింగ్ కిట్‌తో ఓ రోడ్డుపై నడుస్తున్నాడు. ఇది గమనించిన ఓ ఫ్యాన్.. సెల్ఫీ కోసం హాడావుడిగా కారును పార్క్ చేసి వస్తున్నాడు. ఈ క్రమంలో కార్‌ను సరిగ్గా పార్క్ చేయకపోవడంతో, ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే, కారు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోయాడు. హాడావుడిగా కోన్‌స్టాస్ వైపు నడుస్తున్నప్పుడు, కారు ముందుకు కదులుతోంది. అక్కడే ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ సంఘటనకు కాన్స్టాస్ ఎఫెక్ట్ అంటూ పేరు పెట్టి, వీడియోను వైరల్ చేస్తున్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆకట్టుకున్న సామ్ కాన్స్టాస్..

View this post on Instagram

A post shared by Sydney Thunder (@thunderbbl)

బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో కనిపించిన సామ్ కొన్‌స్టాస్, తన తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించడంతో, సంచలనంగా మారాడు. అలాగే, అరంగేట్రం సిరీస్‌లో, అతను 1 హాఫ్ సెంచరీతో 113 పరుగులు చేశాడు.

తాజాగా, 19 ఏళ్ల సామ్ కాన్స్టాస్ ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడు. సిడ్నీ థండర్‌ తరపున బరిలోకి దిగిన ఈ యువ బ్యాట్స్‌మెన్‌ రెండు అర్ధసెంచరీలు చేశాడు.

దీని ద్వారా ఆస్ట్రేలియన్ అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయిన సామ్ కాన్స్టాస్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా టీ20 జట్టులో చోటు దక్కించుకోవడంలో సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి