AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit: ఆసీస్‌లో ఆ బౌలర్‌ను ఎదర్కోవడం చాలా కష్టం..భారత్‌ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి, ఆస్ట్రేలియా బౌలింగ్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అజట్టులో పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్‌ ప్లేయర్స్‌ను మించిన బౌలర్ ఉన్నారన్నారు. స్కాట్‌ బోలాండ్‌ను ఆస్ట్రేలియా జట్టులో కఠినమైన బౌలర్‌గా రోహిత్ శర్మ పేర్కొన్నాడు. అతన్ని ఎదుర్కోవడం భారత్‌కు చాలా కష్టతరమైందన్నారు.

Rohit: ఆసీస్‌లో ఆ బౌలర్‌ను ఎదర్కోవడం చాలా కష్టం..భారత్‌ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు
Rohith On Scott Boland
Anand T
|

Updated on: Apr 17, 2025 | 5:17 PM

Share

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్‌ కోల్పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 3-1 తేడాతో కమిన్స్‌ సేన భారత్‌పై నెగ్గి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో 32 వికెట్లతో టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (POTS) అవార్డును గెలుచుకున్నప్పటికీ,  వాళ్ల బ్యాటింగ్‌ లైనప్‌తో అద్భుతంగా రాణించారు. కానీ ఆస్ట్రేలియా పేస్‌ అటాక్‌ను మాత్రం భారత్‌ తట్టుకోలేకపోయింది. ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి స్టార్‌ల దూకుడు ముందు నిలవలేక పోయింది. వీళ్లే కాదు ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్, స్కాట్‌ బోలాండ్‌ సైతం అద్భుతంగా రాణించారు. ఇదే విషయంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో బియాండ్ 23 అనే క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా బౌలింగ్‌పై  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌ కాదు.. వీళ్ల కంటే డేంజర్ బౌలర్ ఆసీస్‌లో ఉన్నట్టు తెలిపాడు. స్కాట్‌ బోలాండ్‌ను ఆస్ట్రేలియా జట్టులో అత్యంత కఠినమైన బౌలర్‌గా తాము భావించామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. “స్కాట్ బోలాండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైందని.. అతని బౌలింగ్‌లో పరుగులు సాధించేందుకు బోలాండ్ పిచ్ మ్యాప్‌ను కూడా తనిఖీ చేసినట్టు రోహిత్ చెప్పుకొచ్చారు. తాము అతని బౌలింగ్ లో ఎలా ఆడితే పరుగులు చేయవచ్చేనే దానిపై చాలా వరకు దృష్టిపెట్టామన్నారు.

భారత్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్ లకు ఆసీస్‌ బౌలర్ హేజల్‌వుడ్‌ దూరమయ్యారు. దీంతో అతని స్థానంలో స్కాట్ బోలాండ్‌ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనే స్కాట్ 21 వికెట్లు తీశాడు. రెండు మ్యాచ్‌లు ఆడకపోయినా బీజీటీ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్కాట్ బోలాండ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక తన బౌలింగ్‌తో భారత్‌ స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని సైతం స్కాట్‌ ఇబ్బంది పెట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బోలాండ్, 13 టెస్ట్ మ్యాచుల్లో 56 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…