AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs RR: సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం! అంతా అతనే చేశాడా..?

రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు సాగి, అభిమానులకు ఉత్కంఠను కలిగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ హెట్‌మేయర్‌ను సూపర్ ఓవర్‌కు పంపడం వల్ల ఓటమి పాలయ్యింది. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ తో ఢిల్లీకి విజయం అందించాడు. రాజస్థాన్ తప్పుడు నిర్ణయాలు ఓటమికి కారణమయ్యాయి.

DC vs RR: సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం! అంతా అతనే చేశాడా..?
Dc Vs Rr Super Over
SN Pasha
|

Updated on: Apr 17, 2025 | 11:27 AM

Share

ఐపీఎల్‌ 2025లో సూపర్‌ థ్రిల్లర్స్‌ వీక్‌ నడుస్తున్నట్లు ఉంది. పంజాబ్‌ కేకేఆర్‌ మధ్య జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. తాజాగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ అయితే.. ఏకంగా ఇన్నింగ్స్‌ చివరి బాల్‌కు టై అయి.. సూపర్‌ వరకు దారి తీసింది. ఈ సూపర్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే వినోదాన్ని అందించింది. మొత్తం ఓడిపోతుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లి.. సూపర్‌ ఓవర్‌లో గెలిచింది. కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న రాజస్థాన్‌ చేచేతులా మ్యాచ్‌ను ఢిల్లీకి అప్పగించింది. అయితే.. ఢిల్లీ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సూపర్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ చివరి ఓవర్‌లో 9 పరుగులు డిఫెండ్‌ చేయడంతో పాటు.. సూపర్‌ ఓవర్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఢిల్లీకి విజయాన్ని అందించాడు.

కాగా, మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ టైమ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ ఓటమికి వాళ్ల సొంత తప్పిదం కూడా కారణం అయింది. మ్యాచ్‌ టై అయిన తర్వాత.. సూపర్‌ ఓవర్‌ కోసం హెట్‌మేయర్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ను పంపించింది. నిజానికి హెట్‌మేయర్‌ అంతకుముందే.. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో రన్స్‌ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. స్టార్క్‌ వేసే యార్కర్లకు సింగిల్స్‌ మాత్రమే తియగలిగాడు. అలాంటి బ్యాటర్‌ను మళ్లీ స్టార్క్‌ బౌలింగ్‌లో సూపర్‌ ఓవర్‌ ఆడేందుకు పంపడం బ్లండర్‌ మిస్టేక్‌. అతని ప్లేస్‌లో మ్యాచ్‌లో సూపర్‌గా ఆడుతూ.. బాల్‌ అద్బుతంగా టైమ్‌ చేస్తున్న నితీష్‌ రాణాను పంపింతే ఫలితం బాగుండేది. ఎందుకంటే.. స్టార్క్‌ యార్కర్లను డీప్‌ ఇన్‌ ది క్రీజ్‌ ఉంటూ.. ఓవర్‌ ది కవర్స్‌ షాట్లను రానా బాగా ఆడే వాడు. కానీ, టీమ్‌లో చాలా చర్చ జరిగిన తర్వాత హెట్‌మేయర్‌, పరాగ్‌ను పంపారు.

పోని ఒక వికెట్‌ పడిన తర్వాత అయినా రానాను పంపారా అంటూ అది లేదు.. యశస్వి జైస్వాల్‌ను పంపారు. అప్పటికే రన్స్‌ రావట్లేదని తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెట్‌మేయర్‌.. వాళ్లిద్దరిని రనౌట్‌ చేశాడు. తొలి రనౌట్‌లో పూర్తిగా హెట్మేయర్‌దే తప్పు. ఎందుకంటే.. అంతకు ముందు బాల్‌ను పరాగ్‌ ఫోర్‌ కొట్టాడు. పైగా అది నో బాల్‌. ఎక్స్‌ బాల్‌ ఉంది. సో.. స్ట్రైక్‌ పరాగ్‌ వద్ద ఉన్న ఇబ్బంది ఉండేది కాదు. కానీ, లేని రన్‌ కోసం వెళ్లి పరాగ్‌ను రనౌట్‌ చేశాడు. ఇక చేసేది ఏం లేక.. పరాగ్‌ తన వికెట్‌ను హెట్‌మేయర్‌ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. మొత్తం రెండు బౌండరీలు, ఒక నో బాల్‌ వచ్చిన సూపర్‌ ఓవర్‌లో రాజస్థాన్‌ కేవలం 11 రన్స్‌ మాత్రమే చేయగలిగింది అంటే కచ్చితంగా హెట్‌మేయర్‌ను సూపర్‌ ఓవర్‌లో ఆడించడమే కారణం. అయితే.. ఈ నిర్ణయం హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ తీసుకొని ఉంటాడాని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే