Rohit Sharma: టీమిండియా దిగ్గజం మాటలకు నొచ్చుకున్న రోహిత్.. బీసీసీఐకి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే?
ఆస్ట్రేలియా పర్యటన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పీడకలలా మారింది. ఈ పర్యటనలో హిట్ మ్యాన్ పై చాలా విమర్శలు వచ్చాయి. అతని నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఓ టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విమర్శలతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం.

టెస్టు క్రికెట్‌లో టీమిండియా పేలవ ప్రదర్శనతో రోహిత్ శర్మకు కష్టాలు ఎక్కువయ్యాయి. అతని కెప్టెన్సీని ప్రశ్నించారు. కెప్టెన్సీలోనే కాదు, తన పేలవమైన ఫామ్ కారణంగా అతనే చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ఆటతీరు చూసిన పలువురు సీనియర్ క్రికెటర్లు, మాజీలు కాస్త పరుషంగా మాట్లాడారు. అయితే ఈ విమర్శలకు రోహిత్ నొచ్చుకున్నాడని సమాచారం. దీనిపై హిట్ మ్యాన్ బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేశాడని సమాచారం. రిపోర్టుల ప్రకారం రోహిత్ ఫిర్యాదు చేసింది లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గురించేనని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోర పరాజయం పాలైన తర్వాత బీసీసీఐతో సమావేశం జరిగింది. ఈ విషయాన్ని రోహిత్ శర్మ లేవనెత్తినట్లు క్రిక్‌బ్లాగర్ నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనలో సునీల్ గవాస్కర్ అవసరానికి మించి ప్రతికూల కామెంట్స్ చేశాడని రోహిత్ సమావేశంలో వాపోయాడట. బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ క్రిక్‌బ్లాగర్ ఈ నివేదికను అందించింది. గవాస్కర్ ఇంత పరుష పదజాలంతో విమర్శించాల్సింది కాదని రోహిత్ బీసీసీఐతో చెప్పాడట. ‘సునీల్ గవాస్కర్ ఆటగాళ్లను ఇంత పరుష పదజాలంతో విమర్శించాల్సింది కాదు. వ్యాఖ్యాతల ప్రత్యక్ష విమర్శలతో ఆటగాళ్ల మూడ్ మారిపోతుంది. అందువల్ల ఇలాంటి విమర్శలను తీవ్రంగా పరిగణించాలి’ అని రోహిత్ శర్మ బీసీసీఐకి సూచించాడట.
సునీల్ గవాస్కర్ కామెంట్స్ ఇవే..
- బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ వ్యాఖ్యాతగా కనిపించాడు. ఈ సమయంలో ఆయన మాట్లాడిన పలు మాటలు చర్చనీయాంశమయ్యాయి.
- తొలి టెస్టులో టీమిండియా గెలిచినందున జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా కొనసాగించాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు.
- రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా ఓడిపోతున్నందున, జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని గవాస్కర్ బహిరంగంగా చెప్పాడు.
- రిషబ్ పంత్ ప్రయోగాత్మక షాట్ల ఆడితే, అతనిని ఫూల్ అని విమర్శించాడు.
- రోహిత్ శర్మ పేలవంగా బ్యాటింగ్ చేస్తుంటే అతనికి పాప ఉంది. కాబట్టి భార్యతో విశ్రాంతి తీసుకోవడమే మంచిదన్నాడు.
ఇలా సునీల్ గవాస్కర్ టోర్నీ మొత్తం వివిధ ప్రకటనల ద్వారా వార్తల్లో నిలిచాడు. అయితే ఇలాంటి ప్రకటనలు టీమిండియా ఆటగాళ్ల పై ప్రతికూలంగా ప్రభావం చూపుతాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని రోహిత్ శర్మ బీసీసీఐని కోరాడు.
🚨 Breaking 🚨
Rohit Sharma has allegedly accused renowned commentator Sunil Gavaskar, of being “too negative”about his recent form in Australia and even complained to the BCCI during one of the meetings.
— sources#ViratKohli𓃵 #RohithSharma #INDvsAUS #INDvsENG #CT2025 #T20 pic.twitter.com/anQgBjJDdy
— Dharma Watch (@dharma_watch) January 27, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..