AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin: సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్.. కొడుకును చూశారా ఎంత క్యూట్‌గా ఉన్నాడో! వీడియో

టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆదివారం (జనవరి 26) అతను భార్య షాలిని, కుమారుడితో కలిసి ఏడు కొండల స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. నితిన్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

Nithiin: సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్.. కొడుకును చూశారా ఎంత క్యూట్‌గా  ఉన్నాడో! వీడియో
Nithiin Family
Basha Shek
|

Updated on: Jan 26, 2025 | 8:38 PM

Share

టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో నితిన్ తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నితిన్ వెంట భార్య షాలిని, కొడుకు ఉన్నారు. దర్శనం అనంతరం నితిన్ కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశ్వీరచనం అందించారు. టీటీడీ సిబ్బంది పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుటకు వచ్చిన నితిన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. కాగా గతేడాది నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. సెప్టెంబర్ లో తనకు కుమారుడు జన్మించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చాలా మంది సెలబ్రిటీల్లాగే నితిన్ కూడా తన తనయుడికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు ఇప్పటివరకు బయటకు రానీయలేదు. దీంతో జూనియర్ నితిన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక తిరుమలలోనూ తమ కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడారు నితిన్- షాలినీ. అయితే కొందరు మాత్రం నితిన్ కొడుకు ముఖాన్ని తమ సెల్ ఫోన్ల కెమెరాలలో బంధించారు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు జూనియర్ నితిన్ క్యూట్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. గతేడాది క్రిస్టమస్‌ విడుదల కావాల్సిన ‘రాబిన్‌ హుడ్‌’ వాయిదా పడింది. పుష్ప-2 ప్రభంజనం నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్‌ కాలేదు. దీంతో ఫిబ్రవరిలో నితిన్ సినిమా రిలీజ్ ‍అయ్యే ఛాన్స్ ఉంది. రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో రాబిన్ హుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడుఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. రాబిన్ హుడ్ తో పాటు తమ్ముడు అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు నితిన్.

తిరుమలలో నితిన్ దంపతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!