Nostradamus: 2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

Nostradamus: 2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2024 | 11:05 AM

ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందీ మనమంతా చూశాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్ళీ గెలవడం, టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్‌, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి, ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాలు యుద్ధాలు ఇవన్నీ మనం చూశాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది

ఈ ప్రశ్న మొదలైనప్పుడల్లా ప్రపంచమంతా ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడనే చూస్తుంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు, ప్రపంచ యుద్ధాలు, అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత ఇలా ఎన్నో అంశాల గురించి ఈ కాలజ్ఞాని చెప్పినవన్నీ దాదాపు జరిగాయనే చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రానున్న 2025 కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు? 1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం, అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు, కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనా వేసి చెప్పారు. అతను 1555లో ప్రచురించిన ది ప్రొఫెసిస్‌ పుస్తకం దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు. ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమిమీద పెను మార్పులు సంభవిస్తాయి. బ్రిటన్‌లో ప్లేగ్‌ వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారు. ఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుంది. సుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అలసిపోతుందనీ ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి కాబట్టి పేదరికానికి చేరువవుతూ యుద్ధాన్ని ముగిస్తారు అని నోస్ట్రడామస్‌ చెప్పారు.

అంటే మూడేళ్లుగా సాగుతున్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యం అని నోస్ట్రడామస్‌ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి, వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్లిపోతున్నాయి. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్, ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు…దారుణ పరిస్థితులకు ప్రభవితమవుతుందని నోస్ట్రడామస్‌ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్ల వంటి ఘటనలు కూడా జరగవచ్చు అని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.