AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనుల్లో ఆటంకాలా.. గణపతి అనుగ్రహం కోసం సంకట హర చతుర్థి రోజున వీటిని నైవేద్యంగా సమర్పించండి..

అఖురథ సంకట హర చతుర్థి రోజున విఘ్నాలధిపతి గణేశుడిని పూజిస్తారు. గణపతి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. ఈ రోజున వినాయకుడికి పూజ చేసి ఉపవాసం ఉండి ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున గణపతి ప్రసన్నం కోసం ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం.

పనుల్లో ఆటంకాలా.. గణపతి అనుగ్రహం కోసం సంకట హర చతుర్థి రోజున వీటిని నైవేద్యంగా సమర్పించండి..
Sankatahara Chaturthi 2024
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 5:30 PM

Share

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అఖురథ సంకట హర చతుర్థి జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అడ్డంకులు తొలగించమంటూ ఆది పూజ్యుడు గణేశుడిని పూజిస్తారు. గణపతి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు. అంతేకాదు స్వామివారికి ఇష్టమైన ఆహారపదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గణేశుడిని పూజించడం, ఆయనకు నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తుంది. గణపతి ఆశీస్సులు, జీవితంలో ఆనందం, శాంతిని కోరుకుంటే.. అఖురథ సంకట హర చతుర్థి రోజున గణపతికి ఇష్టమైన వస్తువులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషిస్తాడు. హిందూ మత గ్రంధాల ప్రకారం అఖురథ సంకట హర చతుర్థి రోజున గణపతికి ఏ వస్తువులు సమర్పించాలో తెలుసుకుందాం..

అఖురథ సంకట హర చతుర్థి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర మాసంలో అఖురథ సంకట హర చతుర్థిని డిసెంబర్ 18 న జరుపుకోవాలి. చతుర్ధి తిధి డిసెంబర్ 18 ఉదయం 10:43 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి డిసెంబర్ 19 ఉదయం 10:02 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిధి ప్రకారం అఖురథ సంకట హర చతుర్థిని డిసెంబర్ 18న జరుపుకోవాలి.

వేటిని గణేశుడికి సమర్పించాలంటే

  1. అఖురథ సంకట హర చతుర్థి రోజున వినాయకుడిని పూజించి.. శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. హిందూ విశ్వాసాల ప్రకారం శనగపిండి లడ్డూలను సమర్పించడం ద్వారా చేపట్టిన పనిలో విజయం సాధిస్తాడు.
  2. గణపతికి మోదకం సమర్పించండి. గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు సమర్పించడం వలన గణపతి సంతోషిస్తాడని .. భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.
  3. కుంకుమపువ్వుతో చేసిన బియ్యం పాయసాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి.
  4. అఖురథ సంకట హర చతుర్థి రోజున గణపయ్యకు మోతీచూర్ లడ్డూలు నైవేద్యంగా సమర్పించండి.
  5. గణేశునికి కొబ్బరికాయ, నెయ్యి, దర్భగడ్డిని, బెల్లం సమర్పించండి.

అఖురథ సంకట హర చతుర్థి ప్రాముఖ్యత

అఖురథ సంకట హర చతుర్థి రోజున వినాయకుడిని నియమాలను అనుసరిస్తూ పూజించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల ఆటంకాలు, కష్టాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజున గణేశుని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. గణేశుడు జ్ఞానానికి అధిపతి అని హిందువుల నమ్మకం. కనుక గణపతిని పూజించడం వల్ల తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. అఖురథ సంకట హర చతుర్థి రోజున గణపతిని పూజించడం వలన వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగి.. సుఖ శాంతులు నెలకొంటాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.