Women Jobs: ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..: ఇండియా ఎట్‌ వర్క్‌ నివేదిక

ఉద్యోగ దరఖాస్తుల్లో మహిళల భాగస్వామ్యం యేటా పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది మొత్తం 7 కోట్లు ఉద్యోగ దరఖాస్తులు వస్తే.. అందులో మహిళల నుంచి ఏకంగా 2.8 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా టైర్ 1 , టైర్ 2 వంటి మెట్రో నగరాల నుంచే అధిక మంది మహిళలు దరఖాస్తులు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది..

Women Jobs: ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..: ఇండియా ఎట్‌ వర్క్‌ నివేదిక
Women Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 26, 2024 | 6:12 AM

ఢిల్లీ, డిసెంబర్‌ 26: 2024 ఏడాదికి సంబంధించి మొత్తం 7 కోట్ల ఉద్యోగాల దరఖాస్తుల్లో మహిళలు దాదాపు 2.8 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. జాబ్ ప్లాట్‌ఫారమ్ Apna.co నిర్వహించిన ‘ఇండియా ఎట్ వర్క్ 2024’ నివేదిక ఈ మేరకు వెల్లడించింది. ఇది 2023తో పోలిస్తే మహిళల ఉద్యోగ దరఖాస్తుల సంఖ్య 20 శాతం పెరిగిందని పేర్కొంది. శ్రామిక వర్గంలో మహిళలు మరింతగా భాగస్వాములవుతుండటంతో దేశ ఉద్యోగ ముఖచిత్రంలో చారిత్రక మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొంది.

మొత్తం 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో మహిళలు సమర్పించినవి 2.8 కోట్లు. ఇది యువతలో మహిళల అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం సూచిస్తుంది. ఇందులో ఒకటో శ్రేణి నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌ల నుంచి 1.52 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. జైపూర్, లఖ్‌నవూ, భోపాల్‌ వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి 1.28 కోట్ల మహిళల దరఖాస్తులు అందాయి. ఇది మెట్రో హబ్‌లు కాని నగరాల్లోనూ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయనడానికి మంచి నిదర్శనమని ఇండియా ఎట్‌ వర్క్‌ నివేదిక తెలిపింది.

గత ఏడాదితో పోలిస్తే 2024లో మహిళల జీతాల్లో సరాసరిన 28 శాతం పెరుగుదల కనిపించినట్లు ఈ నివేదిక పేర్కొంది. మహిళలు ఆరోగ్యం, ఆతిథ్యం, రిటైల్, ఈ-కామర్స్‌ రంగాల్లో అధికంగా రాణిస్తున్నారని, సంప్రదాయాలను పటాపంచలు చేస్తూ ఫీల్డ్‌ సేల్స్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ సర్వీసెస్‌ వంటి ఉద్యోగాల్లోనూ మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నారని వెల్లడించింది. సీనియర్, మేనేజర్‌ స్థాయి ఉద్యోగాల కోసం మహిళల దరఖాస్తుల్లో 32 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. అలాగే ఫ్రెషర్స్‌ నుంచి వచ్చే దరఖాస్తులు కూడా ఏటా 27 శాతం పెరుగుతునట్లు ఈ నివేదిక వివరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.