Viral Video: గాల్లో ఫీట్లు అనుకుంటిరా..? స్కూల్‌ బస్సు టైర్‌ పేలడంతో ఎగిరిపడిన మెకానిక్‌! వీడియో చూశారా..

ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్ పంక్చర్ కావడంతో దగ్గరిలోని మెకానిక్ షాప్ కు తీసుకెళ్లారు. అక్కడ మెకానిక్ టైర్ ఊడదీసి పంక్చర్ వేసి.. గాలి నింపేందుకు యత్నించాడు. అంతే అదికాస్తా ఒక్కసారిగా పేలాడు. ఈ ఘటనలో వెనుకకు తిరిగి ఉన్న మెకానిక్ ఒక్కసారిగా తలకిందులుగా ఎగిరిపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

Viral Video: గాల్లో ఫీట్లు అనుకుంటిరా..? స్కూల్‌ బస్సు టైర్‌ పేలడంతో ఎగిరిపడిన మెకానిక్‌! వీడియో చూశారా..
Tyre Explodes At Vehicle Workshop
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 25, 2024 | 10:17 AM

బెంగళూరు, డిసెంబర్‌ 25: స్కూల్‌ బస్సు టైరుకి గాలి నింపుతుండగా చేస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. దీంతో మెకానిక్‌ అమాంతం గాలిలోకి ఎగిరిపడ్డాడు. తలకు గాయమైన అతడ్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అక్కడి సమీపంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉడిపి జిల్లా మంగళూరులోని జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ వాహన టైరు పంక్చర్ షాపు ఉంది. అక్కడ అబ్దుల్ రజీద్ (19) అనే యువకుడు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఓ ప్రవేట్‌ స్కూల్‌ బస్సు టైర్‌కు పంక్చర్‌ కావడంతో ఈ షాప్‌ వద్దకు వచ్చింది. దీంతో మెకానిక్‌ అబ్దుల్‌ ఆ స్కూల్‌ బస్సు టైర్‌కు రిపేర్‌ చేయడం ప్రారంభించాడు. బస్సు టైర్‌ను ప్యాచింగ్‌ వర్క్‌ పూర్తయ్యాక, టైర్‌కి గాలి నింపుతుండగా అది ఒక్కసారిగా పేలింది. అదే సమయంలో అక్కడ నుంచి వెనుకకు తిరిగిన అబ్దుల్‌ ఏదో పరికరం కోసం వెతుకుతుండగా టైర్‌ పేలింది.

ఇవి కూడా చదవండి

దీంతో అబ్దుల్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. పక్కనే ఉన్న ఇనుప వస్తువులపై పడటంతో అబ్దుల్‌ తలకు బలమైన గాయమైంది. దీంతో అతడిని మంగళూరులోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ దృశ్యాలు సమీపంలోని మరో షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కెమెరా రికార్డింగ్‌ సంఘటన తేదీని బట్టి డిసెంబర్‌ 21గా తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?