అరటి పండ్ల బండిని చూసి పారిపోతున్న కోతులు.. ఏం జరిగిందంటే ??
కోతుల బెడద నుండి తప్పించుకోవడానికి. .. కొండముచ్చును గ్రామాలలో తిప్పడం చూశాం.. ఇంటి ముందు కొండముచ్చు, పెద్దపులి బొమ్మలు పెట్టి కోతులను భయపెట్టడం చూశాం..కానీ ఓ వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి.. ఓ సైరన్‌తో కోతులను హడలెత్తిస్తున్నాడు. ఆ అరటిపండ్ల వ్యాపారి వాహనం వస్తుందంటే చాలు కోతులన్ని పరార్... ఇదేంటి? అరటిపళ్లను చూస్తే కోతులు ఓ పట్టు పట్టకుండా వదలవ్....అలాంటిది అరటిపండ్ల బండిని చూసి పారిపోతున్నాయా అనుకుంటున్నారా?
అవును..కోతుల బెడదనుంచి తప్పించుకోడానికి ఆ వ్యాపారి ప్రత్యేకమైన సైరన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సైరన్ వినపడగానే కోతులు భయంతో పరుగులు తీస్తున్నాయి. మీరు ఇప్పటివరకు పోలీస్ సైరన్ విని ఉంటారు… అంబులెన్స్ సైరన్ కూడా విని ఉండొచ్చు…. కానీ ఈ సైరన్ మాత్రం వేరే లెవెల్.. అదే డాగ్ సైరన్. డాగ్ వాయిస్ తో కోతులను అదరగొడుతున్నాడు ఈ అరటిపళ్ల వ్యాపారి. దేవేందర్ అనే ఆటో డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట నుండి కొత్తగూడకు రోజు అరటి పండ్లను తీసుకెళ్తుంటాడు.. ఈ ప్రధాన రహదారిపై వేలాది కోతులు ఉంటాయి. కొత్తగూడ రహదారిపై ఎంటర్ అవడంతోనే కోతుల గుంపు అరటిపండ్లను లాక్కొని వెళ్ళేవి. కోతుల నుంచి తప్పించుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కానీ ఫలితం దక్కలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

