Christmas Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీలకు క్రిస్మస్ సెలవులు ప్రారంభంకానున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు జారీ చేశారు. తిరిగి పాఠశాలలు ఎప్పుడు తెరచుకుంటాయి? జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు వస్తాయి? అనే విషయాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

Christmas Holidays 2024: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి స్కూళ్లకు క్రిస్మస్‌ సెలవులు! మొత్తం ఎన్ని రోజులంటే
Christmas Holidays
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 24, 2024 | 11:30 AM

అమరావతి, డిసెంబర్‌ 24: తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్‌ విద్యార్థులకు నేటి నుంచి క్రిస్మస్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులు ఇస్తూ ఇప్పటికే రెండు రాష్ట్రాల విద్యాశాఖలు ప్రకటనలు జారీ చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం నుంచే స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు.

మిగతా స్కూళ్లలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలుగా ప్రకటించారు. దీంతో డిసెంబర్‌ 25, 26 తేదీల్లో పబ్లిక్ హాలీడేస్‌గా ప్రకటించారు. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ పండుగ కాగా.. డిసెంబర్‌ 26న బాక్సింగ్‌ డే కావడంతో ఈ రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలతోపాటు బ్యాంకులు ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఇచ్చారు. ఏపీలో రేపు పబ్లిక్ హాలీడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి డిసెంబర్‌ 27వ తేదీన బడులు, కాలేజీలు పునఃప్రారంభంకానున్నాయి.

కిస్మస్‌ సెలవుల తర్వాత జనవరి నెలలో మళ్లీ వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈనెలలో మొత్తం 31రోజులు ఉండగా.. అందులో 9 రోజులు సెలవులు వస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు ఈ 9 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 2025లో కేవలం 22 రోజులు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు తెరచి ఉంటాయి. జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇక జనవరి నెల సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతి సెలవులు కూడా రానున్నాయి. ఆదివారం (జనవరి 12) నుంచి కనుమ వరకు స్కూళ్లకు సెలవులు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
'చూడముచ్చటైన జంట'.. పీవీ సింధు-సాయిల పెళ్లి ఫొటోలు చూశారా?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
వేగంగా వెళ్తున్న కారు గ్లాస్‌పై గగ్గుర్పాటు కలిగించే దృశ్యం..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?