AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SSC Exam Fees: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును మరోమారు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం పాఠశాల విద్యాశాఖ తత్కాల్‌ పథకం కింద ఫీజు గడువును పెంచింది. డిసెంబర్ 27వ తేదీ నుంచి పీజు చెల్లించని విద్యార్ధులు తమ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్ లకు ఫీజు చెల్లించవచ్చు..

AP SSC Exam Fees: పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
SSC Exam Fee
Srilakshmi C
|

Updated on: Dec 25, 2024 | 6:50 AM

Share

అమరావతి, డిసెంబర్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్ధులకు 2024-25 విద్యాసంత్సరానికి వచ్చే మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లింపుల గడువు విద్యాశాఖ మళ్లీ పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష ఫీజు గడువు పెంచుకుంటూ వచ్చిన పాఠశాల విద్యాశాఖ తత్కాల్‌ పథకం కింద ఫీజు గడువును మరోమారు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల కింద రూ.వెయ్యి ఫీజుతో డిసెంబర్‌ 27 నుంచి జనవరి 10 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని సూచించారు.

కాగా ఇప్పటికే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్ కూడా విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభమై 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే మార్చి 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంచడగా.. సరిగ్గా అదే రోజున రంజాన్‌ పండగ వచ్చింది. రంజాన్‌ సెలవు దినంగా ప్రభుత్వం పేర్కొనగా.. ఆ రోజు నెలవంక కనిపిస్తే అదే రోజు రంజాన్‌ ఉంటుంది. దీంతో సెలవు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజున ప్రభుత్వ సెలవు వస్తే ఏప్రిల్‌ 1న సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.

ఇక ఈ ఏడాది మొత్తం 7 పేపర్లకు టెన్త్‌ పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా, జీవశాస్త్రం మరో పేపర్‌గా ఇవ్వనున్నారు. ఒక్కో పేపర్‌ 50 మార్కులకు ఉంటుంది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. సైన్స్‌ పేపర్లకైతే ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే పరీక్షల హడావిడి మొదలైంది. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్ధులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వివరాల కోసం క్లిక్‌ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..