IND vs NZ Final: ఫైనల్‌కు ముందు కివీస్‌కు ఇచ్చిపడేసిన సూర్య భాయ్.. ఏమన్నాడంటే?
INDIA vs NEW ZEALAND Final: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ మార్చి 8న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ కెప్టెన్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

IND vs NZ Final: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు (India national cricket team) మరోసారి ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) నాయకత్వంలో భారత్ వరుసగా రెండోసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ (England national cricket team) పై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) 42 బంతుల్లో 89 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
ఫైనల్ ముందు సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు…
సెమీఫైనల్ విజయం అనంతరం సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌పై స్పందించాడు. అతను మాట్లాడుతూ.. “ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడి, టెన్షన్ ఉండటం సహజం. ముఖ్యంగా భారత్‌లో టైటిల్ కోసం ఆడటం పెద్ద విషయం. కానీ, మా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఈ మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలతో సూర్యకుమార్ యాదవ్ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు పరోక్ష హెచ్చరిక ఇచ్చినట్లైంది.
సంజూ శాంసన్ అద్భుత ఫామ్..
ఈ టోర్నమెంట్‌లో కీలక సమయంలో శాంసన్ ఫామ్‌లోకి రావడం భారత్‌కు పెద్ద బలం అయింది. వెస్టిండీస్‌పై అజేయంగా 97 పరుగులు చేసిన శాంసన్, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాలు అందించాడు.
సెమీఫైనల్ మ్యాచ్ ఎలా జరిగింది?
ముంబైలోని వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 253 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడినా 246 పరుగులకే పరిమితమైంది. భారత్ తరపున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రెండు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో భాగమయ్యాడు.
భారత్ – న్యూజిలాండ్ ఫైనల్ ఎప్పుడు?
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతుంది. లక్షకు పైగా అభిమానులు స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.
2023లో ఇదే మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు అదే స్టేడియంలో టీమ్ ఇండియా ట్రోఫీ గెలిచి అభిమానులకు ఆనందం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
