Best Scheme: నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే చేతికి రూ.5 లక్షలు..బెస్ట్ స్కీమ్!
Best Scheme: డబ్బును రెట్టింపు చేసుకోవడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి అధిక లాభాలు అందించే అవకాశం ఉన్నా, రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఉన్న డబ్బు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రిస్క్..

Best Scheme: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవడం భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అత్యవసరం. ఎక్కువ సంపాదించే వారి కన్నా తక్కువ పొదుపు చేసే వారికే ఆర్థిక రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపదలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి, ఖర్చులను తగ్గించుకొని పొదుపు మంత్రాన్ని పాటించడం మంచిది. అయితే, ఈ పొదుపును మంచి పెట్టుబడిగా మార్చుకుంటే అధిక రాబడులు అందుకోవచ్చు.
డబ్బును రెట్టింపు చేసుకోవడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి అధిక లాభాలు అందించే అవకాశం ఉన్నా, రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఉన్న డబ్బు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రిస్క్ లేకుండా భద్రతతో కూడిన రిటర్న్‌లు పొందాలంటే ప్రభుత్వ పథకాలు ఉత్తమం. అలాంటి పథకాల్లో పోస్ట్ ఆఫీస్ అందించే అద్భుతమైన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకం.
ఇది కూడా చదవండి: PM Kisan Maandhan: రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి నెలకు రూ.3000.. దరఖాస్తు చేసుకోండిలా!
దేశ ప్రజల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెడితే అధిక రాబడిని అందుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.1 శాతం వడ్డీని పొందవచ్చు.
పీపీఎఫ్ పథకం ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలు:
- పెట్టుబడి వ్యవధి: ఈ పథకంలో 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా ఐదు సంవత్సరాల చొప్పున పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది.
- ఎవరు తెరవవచ్చు: ఎవరైనా వ్యక్తి కానీ, మైనర్ పేరిట గానీ పీపీఎఫ్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
- పెట్టుబడి పరిమితులు: ఏటా కనీసం రూ. 500 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలుంటుంది. 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుంది.
- అకౌంట్ ఎక్కడ తెరవాలి: బ్యాంకులతో పాటు, పోస్ట్ ఆఫీసులలో కూడా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించవచ్చు.
- ప్రయోజనాలు: పీపీఎఫ్ స్కీమ్‌పై ఇతర పన్ను ప్రయోజనాలు, గ్యారెంటీడ్ రిటర్న్‌లు లభిస్తాయి.
రూ. 1500 నెలవారీ పెట్టుబడితో రూ. 5 లక్షలు ఎలా?
మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో రూ. 5 లక్షలు పొందాలంటే నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీ వార్షిక పెట్టుబడి రూ.18,000 అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ. 2,70,000 అవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.1 శాతం వడ్డీ రేటుతో మీ పెట్టుబడిపై రూ. 2,18,185 ఆదాయం సమకూరుతుంది. మెచ్యూరిటీ సమయానికి మీ పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ కలుపుకొని మొత్తం రూ. 4,88,185 అందుతుంది. ఇది దాదాపు రూ. 5 లక్షలకు సమానం. మీకు ఇంకా ఎక్కువ ఆదాయం కావాలంటే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. తక్కువ రిస్క్‌తో, భద్రతతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి మార్గాన్ని కోరుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒక ఉత్తమ ఎంపిక.
ఇది కూడా చదవండి: Jio Plans: జియోలో 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ల గురించి మీకు తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
