AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు వెళ్లున్నారా…? రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..! ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Char Dham Yatra registration: ప్రపంచ ప్రఖ్యాత చార్‌ధామ్ యాత్ర 2026కు మార్చి 6 శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బాబా కేదార్ లేదా బద్రీ విశాల్ దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ఈ సమాచారం ఎంతో ముఖ్యమైనది. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ మూడవ వారంలో ప్రారంభం కానుంది. ఈ యాత్ర గురించిన మరిన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.

Chardham Yatra: చార్‌ధామ్ యాత్రకు వెళ్లున్నారా...? రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..! ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Chardham 2026
Rajashekher G
|

Updated on: Mar 06, 2026 | 2:59 PM

Share

దేవభూమి ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత చార్‌ధామ్ యాత్ర 2026 కోసం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ రోజు (శుక్రవారం-మార్చి 06) ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బాబా కేదార్ లేదా బద్రీ విశాల్ దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ఈ సమాచారం ఎంతో ముఖ్యమైనది. ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ మూడవ వారంలో ప్రారంభం కానుంది. ఈ యాత్ర గురించిన మరిన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.

  • ఏప్రిల్ 19: గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకుంటాయి.
  • ఏప్రిల్ 22: కేదార్‌నాథ్ ఆలయం భక్తుల దర్శనార్థం తెరవబడుతుంది.
  • ఏప్రిల్ 23: బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి.

ఎలా నమోదు చేసుకోవాలి?

భక్తులు క్రింది మార్గాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు:

  • అధికారిక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in ను సందర్శించి తమ స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.
  • స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు “Tourist Care Uttarakhand” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు.
  • డిజిటల్ పద్ధతిని ఉపయోగించలేని భక్తుల కోసం ఏప్రిల్ 17 నుంచి రిషికేశ్, హరిద్వార్, డెహ్రాడూన్ నగరాల్లో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
  • ఏదైనా సహాయం అవసరమైతే 0135-1364 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

రిజిస్ట్రేషన్ దశలు

  • దశ 1: ఖాతా సృష్టించడం వెబ్‌సైట్ హోమ్‌పేజీలో Register/Login పై క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వివరాలు నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ధృవీకరణ చేయాలి.
  • దశ 2: టూర్ ప్లాన్ చేయడం లాగిన్ అయిన తర్వాత Create/Manage Tour ఎంపికలోకి వెళ్లి ఒంటరిగా లేదా సమూహంగా ప్రయాణం చేస్తారా అనేది ఎంచుకోవాలి. అలాగే ప్రయాణ తేదీలు, ఉత్తరాఖండ్‌లోకి ప్రవేశించే ప్రదేశం (ఉదా: హరిద్వార్) నమోదు చేయాలి.
  • దశ 3: యాత్ర స్థలాలు, తేదీలు ఎంచుకోవడం మీరు సందర్శించాలనుకున్న తీర్థక్షేత్రాలను ఎంచుకుని క్యాలెండర్‌లో మీకు అనుకూలమైన తేదీని ఎంపిక చేయాలి. ఎరుపు రంగులో ఉన్న తేదీలకు కోటా పూర్తిగా నిండినట్లుగా అర్థం.
  • దశ 4: పత్రాలు అప్‌లోడ్ చేయడం ప్రయాణికుల పేరు, వయస్సు, ఫోటోతో పాటు ఆధార్, ఓటర్ ఐడి వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు వివరాలు నమోదు చేసి స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాలి.
  • దశ 5: సమర్పణ అన్ని వివరాలు సరిచూసుకుని Submit పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత మీకు నిర్ధారణ సందేశం, యాత్ర రిజిస్ట్రేషన్ కార్డ్ అందుతుంది.

సందర్శకుల పరిమితిపై వివాదం

ఈసారి యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చార్‌ధామ్ హోటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం స్థానిక వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే మార్చి రెండో భాగంలో నిరసనలు ప్రారంభిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ మెహతా హెచ్చరించారు. అయితే హిమాలయ ప్రాంతంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని నియంత్రించడం అవసరమని ప్రభుత్వం చెబుతోంది.

Follow Us
గ్రహాల కీలక మార్పులు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ధనలాభం
గ్రహాల కీలక మార్పులు.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం, ధనలాభం
థియేటర్లలో ఆడియెన్స్‌ను వణికించిన తెలుగు సినిమా.. ఇప్పుడు OTTలోకి
థియేటర్లలో ఆడియెన్స్‌ను వణికించిన తెలుగు సినిమా.. ఇప్పుడు OTTలోకి
విజయ్ దళపతి తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్
విజయ్ దళపతి తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్
మీ ఖాతాలో పొరపాటున లక్షల రూపాయలు జమ అయ్యాయా? ఇలా అస్సలు చేయకండి..
మీ ఖాతాలో పొరపాటున లక్షల రూపాయలు జమ అయ్యాయా? ఇలా అస్సలు చేయకండి..
రాధా గాయత్రి మృతి కేసులో లేటెస్ట్ అప్ డేట్
రాధా గాయత్రి మృతి కేసులో లేటెస్ట్ అప్ డేట్
ఎల్‌నినోతో కోరలు చాస్తున్న కరవురక్కసి..!
ఎల్‌నినోతో కోరలు చాస్తున్న కరవురక్కసి..!
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది