AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పటినుంచో ఆ కోరిక ఉండిపోయింది.. అది ఈ సినిమాతో తీరింది: నాగ చైతన్య

వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని అక్కినేని యంగ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య అన్నారు. నాగ చైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC, సుకుమార్ రైటింగ్స్ 'నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ సినిమా తెరకెక్కుతుంది.

ఎప్పటినుంచో ఆ కోరిక ఉండిపోయింది.. అది ఈ సినిమాతో తీరింది: నాగ చైతన్య
Naga Chaitanya
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 2:39 PM

Share

యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రీసెంట్ గా మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం, ఒక్కసారిగా అతని లోపల నుంచి ఒక భయంకరమైన శక్తి గబ్బిలం రూపంలో బయటకు వచ్చి మరో వ్యక్తి తలలోకి దూసుకెళ్లి అతన్ని చంపేయడం వెన్నులో వణుకుపుట్టించేలా వుంది. ‘అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది’ అనే వాయిస్ కథపై మరింత ఆసక్తిని పెంచింది. వృషకర్మ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు ముందుకు అడుగు వేస్తూ గ్లింప్స్ పూర్తి కావడం అదిరిపోయింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ.. వృషకర్మ గ్లింప్స్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ చెప్పినట్టు ఇది నా కెరీర్లో 100 పర్సెంట్ బెస్ట్ మూవీ కాబోతుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే అనిపించింది. ఇంత పెద్ద స్కేల్ లో మిథికల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉండింది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. స్క్రిప్ట్ విన్నప్పుడే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కార్తీక్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. కథ విన్నప్పుడే లార్జెర్ దెన్ లైఫ్ సినిమా అనిపించింది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించారు. కార్తిక్ అనుకున్నది 100% అచీవ్ చేశారు. కార్తీక్ గురించి లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను.

ఎందుకంటే తన అంత మంచి సినిమా ఇచ్చాడు. అంచనాలన్నిటిని ఈ సినిమా అందుకుంటుంది. ఈ సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ అవుతుంది. అది నా ప్రామిస్. స్పర్శ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీనాక్షి, జయరాం గారు, సత్య అందరూ అద్భుతమైన నటీనటులు ఉన్నారు. రాజీవ్ అద్భుతమైన వీఎఫ్ క్స్ ఇచ్చాడు. అజినీస్ మ్యూజిక్, నాగేంద్ర గారి ప్రొడక్షన్ డిజైన్ చాలా గ్రాండ్ గా వుంటాయి అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us