RBI: లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ షాకింగ్ న్యూస్..! పెరగనున్న ఈఎంఐలు..? సామాన్యులపై భారం..
అక్టోబర్ తొలివారంలో ఆర్బీఐ కీలక సమావేశం జరగనుంది. ఆర్బీఐ మానిటరీ కమిటీ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం ఉండొచ్చని అంటున్నారు. ఇదే జరిగితే సామాన్యులపై ప్రభావం చూపనుంది.

లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ షాకిచ్చేందుకు సిద్దమవుతోంది. వడ్డీ రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీ రేట్లను నిర్ణయించే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడం, ఎల్‌నివో ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన క్రమంలో రెపో రేట్లను పెంచేందుకు ఆర్బీఐ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేరవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐ గత కొద్ది నెలలుగా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతోంది. దీంతో మారిన పరిస్థితుల క్రమంలో వడ్డీ రేట్లను ఖచ్చితంగా పెంచే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచంనా వేస్తున్నారు.
అక్టోబర్ తొలివారంలోనే మీటింగ్..
అక్టోబర్ తొలివారంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇదే జరిగితే లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ మరింత పెరగనుంది. కొత్తగా లోన్ తీసుకునేవారికి కూడా అధిక వడ్డీ పడుతుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేవారికి మాత్రం దీని వల్ల లాభం జరుగుతుంది. అధిక వడ్డీ వల్ల ఎఫ్‌డీలపై ఎక్కువ ఆదాయం లభిస్తుంది. గత కొద్ది నెలలుగా వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచడం వల్ల ఈఎంఐలు చెల్లించేవారు ఊరట చెందుతున్నారు. ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచితే వారిపై అదనపు భారం పడుతుంది. కేవలం ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణం తీసుకున్నవారికి మాత్రమే ఈఎఐంలు పెరుగుతాయి. ఫిక్స్‌డ్ వడ్డీ రేటుపై లోన్ తీసుకున్నవారికి ఎలాంటి నష్టం జరగదు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతం ఉండగా.. 25 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశముందని ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వడ్డీ రేట్ల పెంపుతో ఎవరిపై ప్రభావం..?
నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో పాటు ఇంధన ధరల తీవ్రత క్రమంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఆర్బీఐ నిర్దేశిత పరిమితిని దాటి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముంది. దీనిని అదుపు చేయాలంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లను పెంచక తప్పదని ఆర్బీఐ భావిస్తోంది. అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై కీలక ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు. రెపో రేటు పెరిగితే బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను సవరిస్తాయి. దీని వల్ల హోం, వెహికల్, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు పెరిగి సామాన్యులపై ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 7వ తేదీన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించే అవకాశముంది.
