AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నా.. ఖచ్చితంగా హిట్ కొడతా: బండ్ల గణేష్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడేమీ సినిమాలు చేయడం లేదు. కానీ సినిమా హీరోల ఫంక్షన్లకు, సినిమా సక్సెస్ ఈవెంట్లకు తరచూ హాజరవుతున్నాడు. ఎప్పటిలాగే తన కామెంట్స్ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. ఇటీవలే కాలినడకన హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్లారు.

ఆ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నా.. ఖచ్చితంగా  హిట్ కొడతా: బండ్ల గణేష్
Bandla Ganesh
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2026 | 3:18 PM

Share

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించారు. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ రోల్స్ లో నటించి మెప్పించారు బండ్లగణేష్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి నిర్మాతగా మారారు గణేష్. ఆంజినేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఆతర్వాత తీన్మార్‌, గబ్బర్‌ సింగ్‌, బాద్‌షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్‌ లాంటి బడా సినిమాలు నిర్మించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా మారారు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ రీసెంట్ గా బీజీ బ్లాక్‌బస్టర్స్‌ పేరుతో రెండో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. కొత్త దర్శకులు, కొత్త నటీనటులును పరిచయం చేస్తూ సినిమాలు తెరకెక్కించడానికి రెడీగా అవుతున్నారు బండ్ల గణేష్.

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని అనే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిశారు బండ్ల గణేష్. తాజాగా ఆయన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రయూనిట్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు బండ్ల గణేష్. నాకు యాక్ట్ చేయడానికి సమయం లేదు. నా కింద వెయ్యి మంది పని చేస్తున్నారు. నేను సినిమాల్లో నటిస్తుంటే నా వ్యాపారం దెబ్బతింటుంది అని గణేష్ అన్నారు.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

అయితే నాకు నచ్చిన వేషం వస్తే తప్పకుండ చేస్తా.. కానీ పాత్ర నా మనసుకు నచ్చాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నా అని తెలిపారు. అదేవిధంగా నాకు ఓ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది. అది నా బ్యానర్ లోనే నిర్మించి ఆ రోల్ చేస్తాను.. కచ్చితంగా హిట్ కొడతా అని తెలిపారు బండ్ల గణేష్. చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బండ్ల గణేష్ ఆసక్తికర పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్స్
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
అరుదైన గ్రహ యుతి.. ఆ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
W,W,W.. 3 బంతుల్లో 3 వికెట్లు పడినా హ్యాట్రిక్ దక్కలే..
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
బుగ్గపై మచ్చ ఉన్న అమ్మాయి వ్యక్తిత్వం ఇదే.. కానీ ఇక్కడే ట్విస్ట్
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే..
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
వయాగ్రాతో పోల్చే ఈ వంటకం గురించి మీకు తెలుసా..?
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..
క్యాష్ రూపంలో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా..? ఈ పని చేయకపోతే..