AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలకు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఇంగ్లిష్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక హారర్ థ్రిల్లర్ సినిమానే.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2026 | 11:50 AM

Share

హారర్ సినిమాల్లో చిత్ర విచిత్రమైన కంటెంట్‌తో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఓటీటీలో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతుంటే అందులో మూడు నాలుగు సినిమాలు హారర్ జోనర్లే ఉంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆంథాలజీ ఫార్మాట్ లో తెరకెక్కిన ఈ హారర్ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకుల దిమాక్ ఖరాబ్ చేస్తుంది. ఈ సినిమాలో సీన్స్ చూస్తే భయంతో సుస్సూ పడటం గ్యారెంటీ.. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమాలో ఆరు డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీ ప్రేక్షకులకు భయానికి గురి చేస్తాయి. సినిమా కథలోకి వెళ్తే..

అప్పుడు బూటు కాలుతో తన్నులు తిన్నా.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.!! షాకింగ్ విషయం చెప్పిన స్టార్ హీరో

ఒక యువతి ఎనోలా పెన్నీ ఒక పాత థియేటర్‌ చూసి ఆకర్షితురాలవుతుంది. ఒక రాత్రి, థియేటర్ తలుపు స్వయం తెరుచుకుంటాయి. ఆమె లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక భయానకమైన పప్పెట్ షో మొదలవుతుంది. పప్పెట్ హోస్ట్ పెగ్ పోయెట్ ఆమెకు ఆరు భిన్నమైన, భయానకమైన కథలు చెప్పడం మొదలుపెడతాడు. ఈ కథలు హారర్, డార్క్ ఫాంటసీ, గొర్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటాయి. చివరిలో, ఎనోలా ఈ అనుభవం నుంచి ఎలా బయటపడుతుందనేది ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది.

అలీకి హైదరాబాద్‌లో పెద్ద వ్యాపారం..! ముంబై నుంచి సరుకు దింపుతున్నారట..!! ఈ వీడియో మీరూ చూడండి

ఓ కథలో మనుషులను తినే వారి గురించి చూపిస్తారు. ఆ సీన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమాలోని కథలన్నీ ప్రేక్షకులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి.. ఈ సినిమా హారర్ కు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొన్ని కథలు (ముఖ్యంగా “స్వీట్స్” , “ది అక్సిడెంట్”) అద్భుతంగా ఉన్నాయని, కానీ మిగతావి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. IMDb రేటింగ్ 5.2/10. ఈ సినిమా పేరు ది థియేటర్ బిజార్. 2011లో విడుదలైంది ఈ సినిమా. ఈ సినిమాకి ఎనిమిది మంది డైరెక్టర్లు పని చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ట్యుబిలో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఒంటరిగా చూడకండి.

ఇవి కూడా చదవండి

ఇది ఊహించని ట్విస్ట్ గురూ..! ఈ ఫేమస్ స్వామిజీ ఆ స్టార్ కమెడియన్ కొడుకా..!!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us