Bomb Threat: స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపిన విద్యార్ధులు!

గతంలో ఓ సారి తమ స్కూల్ కి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి గుర్తు చేసుకున్న ఇద్దరు స్కూల్ విద్యార్ధులు.. మళ్లీ తమ స్కూల్ కి సెలవులు ఇస్తారన్న ఆశతో ఈసారి తాము చదువుతున్న స్కూళ్లకు తామే బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. దీంతో ఎప్పటి మాదిరిగానే గజగజ వణికిపోయిన స్కూల్ యాజమన్యం పిల్లలందరినీ ఇళ్లకు పంపారు. వీరి ఐడియా ఐతే ఫలించిందిగానీ.. అంతలోనే

Bomb Threat: స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపిన విద్యార్ధులు!
Bomb Threat To Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 23, 2024 | 1:18 PM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23: ఢిల్లీలోని రెండు స్కూళ్లకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులే ఈ పని చేశారని తెలిసి అవాక్కయ్యారు. అసలిలా ఎందుకు చేశారంటే..

నవంబర్‌ 28న రోహిణి ప్రశాంత్‌ విహార్‌ వద్ద పేలుడు సంభవించిన మరుసటి రోజే వెంకటేశ్వర్‌ గ్లోబల్‌ స్కూల్‌తోపాటు మరో స్కూల్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరీక్షలు రాసేందుకు సన్నద్ధంగాలేని ఇద్దరు అన్నదమ్ములు.. పరీక్షలు వాయిదా వేసేందుకు తమ స్కూల్స్‌కి బాంబ్‌ బెదిరింపు ఈమెయిల్స్‌ పంపినట్లు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దర్యాప్తులో తేలింది. దీంతో ఒకే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు తమ స్కూల్‌తోపాటు మరో స్కూల్‌కి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్‌ పంపినట్లు గుర్తించారు. గతంలోనూ తమ స్కూల్‌కి వచ్చిన బాంబు బెదిరింపులను దృష్టిలో ఉంచుకొని బాంబు బెదిరింపు మెయిల్‌ పంపినట్లు ఈ ఇద్దరు గడుగ్గాయిలు చెప్పారు. రోహిణి, పశ్చిమ్‌ విహార్‌లోని ఈ రెండు పాఠశాలల విద్యార్థులు స్కూళ్లు మూతపడాలనే కోరికతో నకిలీ బాంబు బెదిరింపుల ఈ-మెయిల్స్‌ పంపారు. దీంతో ఇద్దరూ విద్యార్ధులే కావడంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

కాగా డిసెంబర్ 14,17 తేదీల్లో ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీనికి ఒక రోజు ముందు డిసెంబర్‌ 13న ఢీల్లీలోని మొత్తం 30 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఐపీ అడ్రస్ ట్రేస్‌ చేయగా ఓ విద్యార్ధి ఇంటిని గుర్తించింది. విచారించగా బాలుడు నేరాన్ని అంగీకరించాడు. పిల్లవాడికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు, అతడి ప్రవర్తనపై నిఘా పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం దేశ రాజధానిలోని పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని పునరావృతమయ్యే బాంబు బెదిరింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మానసిక, విద్యాపరమైన ప్రభావాలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం కొనసాగితే విద్యార్ధుల చదువు, శ్రేయస్సుకు భంగం కలిగిస్తాయని ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఏకంగా స్కూల్‌ పిల్లలే బాంబు బెదిరంపులకు దిగడం విచారకరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయని అధికారులు.. చెలరేగిన వివాదం
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
ఈ ఏడాదిలో విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
76 ఏళ్ల తర్వాత బాక్సింగ్ డే టెస్ట్‌లో హ్యాట్రిక్ కొట్టేనా?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
ఇదేందయ్యా ఇది.! అయోమయంలో మహేష్ ఫ్యాన్స్.. ఒక్క సినిమాకి ఇయర్స్.?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బాలిక... ఏం చేసిందంటే...?
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
ఘనంగా జరిగిన సింధు సాయిల పెళ్లి రేపు హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
భార్యను వదిలేశాడు తప్ప.. చొక్కా మాత్రం వేయలేదు..
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
స్కూళ్లకు సెలవులిస్తారనీ.. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపిన పిల్లలు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!