AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake: కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ముంబైలోని ఓ కోర్టు హాల్‌లో జడ్జి రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇంతలో ఫైళ్ల మధ్యలో ఓ పాము ప్రత్యక్షం కావడంతో కలకలం సృష్టించింది. దీంతో జడ్జి తాత్కాలికంగా కోర్టు కార్యకలాపాలను వాయిదావేశారు. స్నేక్ క్యాచర్‌ను రంగంలోకి దించి కోర్టు హాల్ అంతటా గాలించారు. అయితే..

Snake: కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రతీకాత్మక చిత్రం
Janardhan Veluru
|

Updated on: Dec 24, 2024 | 10:48 PM

Share

కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో పాము ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. దీంతో అక్కడనున్న వారందరూ భయంతో వణికిపోయారు. ముంబైలో ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టులోని రూమ్ నెంబర్.27లో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ఫైళ్లకు మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది.

పాము కనిపించడంతో కోర్టు రూమ్‌లో ఉన్న అందరూ భయాందోళనకు గురైనట్లు ఓ న్యాయవాది తెలిపారు. జడ్జి కోర్టు కార్యకలాపాలను కాసేపు తాత్కాలికంగా వాయిదావేశారు. స్నేక్ క్యాచర్‌ను పిలిపించి పాము కోసం కోర్టు హాల్ అంతటా గాలించినా ఫలితం లేకపోయింది. పాత ఫైళ్లను తొలగించి చాలా సేపు గాలించినా కోర్టు హాల్లో పామును గుర్తించలేకపోయారు. గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. గంట సేపటి తర్వాత కోర్టు కార్యకలాపాలను జడ్జి మళ్లీ ప్రారంభించారు.

కాగా కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదని న్యాయవాదులు తెలిపారు. కోర్టు రూమ్ కిటికీపై సోమవారంనాడు కూడా ఓ పాము కనిపించినట్లు తెలిపారు. రెండు మాసాల క్రితం జడ్జి ఛాంబర్‌లో ఓ పాము కనిపించినట్లు వెల్లడించారు. కోర్టు ఆవరణలో పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున పాములు వస్తున్నట్లు  ఓ న్యాయవాది తెలిపారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..