AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Governors: కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

New Governors: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం అయ్యారు. అలాగే పలువురు గవర్నర్లు వివిధ రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.కొత్తగా నియామకం అయిన గవర్నర్లు బాధ్యతలు చేపట్టనున్నారు.

New Governors: కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
Hari Babu Kambhampati
Subhash Goud
|

Updated on: Dec 24, 2024 | 9:53 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. బీహార్, ఒడిశా, మిజోరాం, కేరళ, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్లు మారారు. ఒడిశా గవర్నర్ పదవికి రఘుబర్ దాస్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో పాటు 5 రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను కూడా రాష్ట్రపతి నియమించారు. రాష్ట్రపతి అజయ్ కుమార్ భల్లాను మణిపూర్ గవర్నర్‌గా నియమించారు. దీంతో పాటు బీహార్ గవర్నర్‌గా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నియమితులయ్యారు.

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసింది. అలాగే ఒడిశా గవర్నర్‌గా ఉన్న రఘుబర్ దాస్ రాజీనామాను ఆమోదం తెలిపింది. మిజోరాం గవర్నర్‌గా జనరల్ వీకే సింగ్ నియామకం కాగా, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది మోడీ సర్కార్‌. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు బిహార్ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక మణిపూర్ గవర్నర్‌గా హోంశాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లా నియామకం అయ్యారు. ఈ నియామకాలు వారు తమ సంబంధిత కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించే తేదీల నుండి అమలులోకి రానున్నాయి.

ఇది కూడా చదవండి: Realme 14 Pro Series: ఉష్ణోగ్రతను బట్టి రంగులు మార్చే స్మార్ట్‌ ఫోన్‌.. భారత్‌లో లాంచ్‌ ఎప్పుడు?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి